Sunday, December 3, 2023

‘రూల్‌కర్వ్‌’పై ఇదేం రుబాబు?

- Advertisement -
- Advertisement -

మనతెలగాణ/హైదరాబాద్ :శ్రీశైలం రిజర్వాయర్ నీటినిర్వహణకు సంబంధించి రూపొందించిన రూల్‌కర్వ్ నివేదికను రిజర్వాయర్స్ మేనేజ్‌మెంట్‌కమిటి మంగళవారం నాడు కృష్ణానదీయాజమాన్య బోర్డుకు సమర్పించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నివేదికలోని ప్ర ధాన అంశాలకు ఏవిధమైన ఆమోదం తెలపకుండానే ఏకపక్షంగా రూపొందించిన ఈ నివేదిక పట్ల కృష్ణాబోర్డు ఏవిధమైన చర్యలు తీసుకుంటుంటున్నది ఇప్పడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. నివేదికను యధాతధంగా అమలు చేయాలా , చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం లేని ఈ నివేదిక చెల్లుబాటు అవుంతుందా.. అమలులో న్యాయపరమైన చిక్కు సమస్యలు వస్తే ఎవరు బాధ్యత వహిస్తారు అన్న అంశంపై కృష్ణాబోర్డు వర్గాల్లో తర్జన భర్జన జరుగుతోంది.

కృష్ణానదీజలాల్లో ఇప్పటికే తమ రాష్ట్రానికి అన్యా యం జరిగిందన్న ఆవేదనతో ఉన్న తెలంగాణ రాష్ట్రం శ్రీశైలం రూల్‌కర్వ్‌లో కూడా అన్యాయం జరిగితే ఇక ఎంతమాత్రం సహించరాదన్న అభిప్రాయంతోవుంది. రాష్ట్ర ప్రజయోజనాలు కాపాడుకునేందు కు ఎంతదూరమైన వెళ్లేందుకు సిద్దంగా ఉన్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ పరిస్థితుల్లో శ్రీశైలం రూల్‌కర్వ్ అ మలులో కృష్ణాబోర్డు కూడా ఆచితూచి అడుగులు వేసేందుకు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. నివేదికను అమలు చేయకుండా నిలిపివేయాలని కోరుతూ ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ కృష్ణారివర్ బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు.

ఆర్‌ఎంసి కమిటి రూపొంచిందిన ముసాయిదా నివేదికను తెలంగాణ ప్రభుత్వం అంగీకరించటం లేదని లేఖ ద్వారా తేల్చిచె ప్పారు. ఆ నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌ఎంసి సమావేశాల్లో వెల్లడించిన అభిప్రాయాల్లో వేటిని పరిగణలోకి తీసుకోలేదని స్పష్టం చేశారు. తెలంగాణ అభిప్రాయాలు ప్రతిబింబించని నివేదికను ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నట్టు కుండ బద్దలు కొట్టారు. తెలంగాణ రాష్ట్రానికి నష్టదాయకంగా ఉన్న ఈ నివేదికను అమలు చేయవద్దని లేఖ ద్వారా గట్టిగానే హెచ్చరిక చేశారు. ఈ పరిస్థితులన్నింటిని దృష్టిలో ఉంచుకొని కృష్ణారివర్ బోర్డు నివేదిక అమలు పట్ల డైలమాలో పడింది. నివేదికను యధాతధంగా కేంద్ర జల్‌శక్తిశాఖకు పంపాలన్న అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. కేంద్ర జల్‌శక్తి శాఖ నుంచి వచ్చే సూచనలు , ఆదేశాల మేరకే రూల్‌కర్వ్ నివేదిక విషయంలో ముందుకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం .

అపవాదులు మూటగట్టుకున్న ఆర్‌ఎంసి

కృష్ణానదిపై ఉన్న ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి నిర్వహణకు సంబంధించి అవసరమైన విధి విధానాలు రూపొందించేందుకు కృష్ణానదీయాజమాన్యబోర్డు ఈ ఏడాది జూన్‌లో రిజర్వాయర్ మేనేజ్‌మెంట్ కమిటీ(ఆర్‌ఎంసి)ని ఏర్పాటు చేసింది. బోర్డు సభ్యకార్యదర్శిగా ఉన్న రవికుమార్ పిళ్లైని ఈ కమిటీకి కన్వీనర్‌గా నియమిచింది. తెలంగాణ, ఆంధప్రదేశ్ రాష్ట్రాల నీటిపారుదల , విద్యుత్ శాఖలకు చెందిన ముఖ్యఅధికారులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సూచనల మేరకు కమిటీలో సభ్యులుగా నియమించింది. మొత్తం ఆరుగురు సభ్యులతో కూడిని ఈ కమిటీ ఏర్పడిన నాటినుంచి ఆరు సార్లు సమావేశాలు నిర్వహించింది. శ్రీశైలం , నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో నీటి మట్టాల నిర్వహణ, రెండు రాష్ట్రాల జలవిద్యుత్ ప్రాజెక్టుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి తదితర అంశాలపై కమిటీలో చర్చించి రెండు రాష్ట్రాల ఆమోదంతో విధివిధానాలు రూపొందించి నివేదికను కృష్ణాబోర్డుకు అందజేయాల్సివుంది.

సోమవారం నాడు జరిగిన ఆర్‌ఎంసి చివరి సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి అధికారులు ఎవరూ హాజరు కాలేదు. ఏపి నుంచి మాత్రమే అధికారులు పాల్గొన్నారు. మొత్తం కమిటీలోని ఆరుగురు సభ్యుల్లో నలుగురు మాత్రమే ఆర్‌ఎంసి రూపొందించిన రూల్‌కర్వ్ ముసాయిదాను ఆమోదిస్తూ సంతకాలు చేసినట్టు సమాచారం. దీంతో కమిటీలో మెజార్టీ ఆమోదం లభించిందన్న ధీమాతో తదనంతరం ఉత్పన్నమయ్యే పరిణామాలపై ఏమాత్రం ఆలోచించకుండానే ఆర్‌ఎంసి కన్వీనర్ ఆఘమేఘాల మీద ముసాయిదా నివేదిను కృష్ణాబోర్టుకు సమర్పించి అంతటితో తమపని ముగిసిందన్నరీతిలో చేతులు దులిపేసుకున్నారు. ముసాయిదాలో ప్రధానంగా శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించి మాత్రమే విధివిధానాలు నిర్ణయించారు. ప్రాజెక్టులో కనీస నీటిమట్టం జులై నుంచి ఆక్టోబర్ 31వరకూ 854అడుగులపైన ఉండాలని నిర్ణయించారు. ఈ స్థాయికి పైన ఉన్న నీటిని మాత్రమే సెప్టెంబర్ నుంచి విద్యుత్ అవసరాలకు ఉపయోగించుకోవాలని నిర్ణయించారు.

అదికూడా శ్రీశైలం దిగువన ఉన్న నాగార్జున సాగర్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తాగునీరు, సాగునీటి అవసరాలు ఉన్నప్పుడు మాత్రమే విద్యుత్ ఉత్పత్తి ద్వారా శ్రీశైలం రిజర్వాయర్‌లోని నీటిని దిగువకు విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం ఎటువంటి పరిస్థితుల్లోనూ 815అడుగుల కంటే దిగువకు తగ్గించరాదని కమిటి నిర్ణయించింది. విద్యుత్ ఉత్పత్తి రెండు రాష్ట్రాలు 50:50 నిష్పత్తిలో పంచుకోవాలని నిర్ణయించింది. అక్టోబర్ తర్వాత శ్రీశైలం నిటిమట్టం అవసరాలకు తగ్గట్టుగా 854 అడుగుల నుంచి 815అడుగుల స్థాయికి తీసుకుపోయేలా నిర్ణయించారు. ఏపికూడా తెలంగాణ రా్రష్ట్రం వినియోగిస్తున్నట్టుగానే రివర్స్‌బుల్ పంపింగ్ వ్యవస్థను తెలంగాణకు అవసరం లేని సమయంలో వినియోగించుకోవాలని, ఇందుకు ఖర్చు కూడా ఆ రాష్ట్రమే భరించాలని నిర్ణయించింది.

కృష్ణానదిలో 75శాతం నీటి లభ్యతకు మించి వచ్చేనీటిని మిగులు జలాల కింద లెక్కవేసింది. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయిలో నిండి స్పిల్‌వేల మీదుగా పొంగిపోర్లుతున్నప్పుడే ఆ నీటిని వరద జలాలుగా పరిగణించాలని నిర్ణయించింది. ఆ నీటిని రెండు రాష్ట్రాలు వాడుకున్నప్పటికీ ఆయా రాష్ట్రాల నీటి వాటాలో కలపరాదని, అయితే ప్రతి నీటిచుక్కను లెక్కించాలని నిర్ణయించింది. ప్రతియేటా నీటి సంవత్సరం ప్రారంభంలో ఒకసారి, ముగింపులో మరో సారి మిగులు జలాలు వచ్చిన సమయాన్ని రికార్డు చేయాలని కమిటి నిర్ణయించి ఈ మేరకు ముసాయిదా నివేదికను బోర్డుకు సమర్పించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News