Sunday, June 16, 2024

బంగాళాఖాతంలో వాయుగుండం..తెలంగాణలో తేలికపాటి వర్షాలు

- Advertisement -
- Advertisement -

పశ్చిమ మధ్య, దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుందని, శనివారం నాటికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 25న తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశాలున్నాయని, 26 నాటికి పశ్చిమ బెంగాల్ తీరానికి తుఫాను చేరుతుందని తెలిపింది. బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి రుతుపవనాలు విస్తరించాయి. ఈ క్రమంలో తెలంగాణలో రాగల రెండురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం,

మహబూబాబాద్, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది. శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్, హన్మకొండ, జనగామ, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే సూచనలున్నట్టు తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయని వెల్లడించింది. శనివారం రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని తెలిపింది.

పలుచోట్ల తేలికపాటి వర్షం:
రాష్ట్రంలో గురువారం పలు చోట్ల తేలికపాటి వర్షం కురిసింది. సూర్యాపేట జిల్లా రఘునాధపాలెంలో గరిష్టంగా 19.3 మి.మి వర్షం కురిసింది. మరో వైపు పగటి ఉష్ణగ్రతలు 44డిగ్రీలను దాటేశాయి.అదిలాబాద్ జిల్లా అర్లిలో గరిష్టంగా 44.4డిగ్రీలు నమోదయ్యాయి. అదిలాబాద్‌లో 43.9, బేలలో 43.3, కామారెడ్డి జిల్లా దొంగ్లిలో 43.1, నిర్మల్ జిల్లా అబ్దుల్లాపూర్‌లో 42.9 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News