Thursday, October 10, 2024

నేతన్నలకూ రుణమాఫీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ సాధ న కోసం కొట్లాడి కొండాలక్ష్మణ్ బాపూజీ ఆనా డు మంత్రి పదవులు త్యజించి త్యాగాలు చేస్తే , కొందరు రాజీనామాలు చేసి ఉప ఎన్నికల పేరు తో సెలక్షన్లు ,కలెక్షన్లు చేసి కోట్లు గడించారని, అదే త్యాగమని చెప్పుకుంటున్నారని ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి పరోక్షంగా బిఆర్‌ఎస్‌నేతలనుఉద్దేశించి పేర్కొన్నారు. రాష్ట్రంలో నేతన్నల రుణా లు మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రెవంత్‌రెడ్డి ప్రకటించారు.సోమవారం హైదరాబాద్‌లో ఇం డియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ(ఐఐహెచ్‌టీ) సంస్థను ముఖ్యమంత్రి వర్చువల్‌గా ప్రారంభించారు. లలిత కళా తోరణంలో జ రిగిన ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సీఎం ప్రారంభించారు. ప్ర స్తుతానికి తాత్కాలికంగా తెలుగు యూనివర్సిటీ ఆవరణలో ఈ ఏడాది తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు.’

స్కిల్ యూనివర్సిటీ అందుబాటులోకి వచ్చాక పూర్తిస్థాయిలో అక్కడ ఏర్పాటుచేయనున్నారు. ఈ కేంద్రంలో ఏటా 60 మం దికి టెక్స్‌టైల్ టెక్నాలజీలో డిప్లొమా కోర్సుల్లో భాగంగా ఆవిష్కరణల ప్రోత్సాహానికి శిక్షణ కా ర్యక్రమాలు నిర్వహించనున్నారు. అధునాతన పరిశోధన అవకాశాలు కల్పించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చేనేత అభయహస్తం లోగో ఆవిష్కరించారు. నేతన్న చేయూతకు సం బంధించి రూ.290 కోట్లు చెక్కును చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌కు అందజేశారు. చేనేత పొదుపు లబ్ధిదారులకు చె క్కులు పంపిణీ చేశారు. కుటుంబ పెద్దను కోల్పోయిన నామినీలకు బీమా చెక్కులు అందించారు.

మా ప్రభుత్వానికి రైతన్న, నేతన్న ఒక్కటే :
ఐఐటీహెచ్ విద్యార్థులకు నెలకు రూ.2,500 చొప్పున అందించే స్కాలర్‌షిప్‌లను సీఎం అందజేశారు. తెలంగాణలో ఐఐహెచ్‌టీ ఏర్పాటుకు పదేళ్లలో కేంద్రం చర్యలు చేపట్టలేదని సీఎం రేవంత్ గుర్తుచేశారు. తాము అధికారంలోకి రాగానే ఐఐహెచ్‌టీ ఏర్పాటు చేయాలని ప్రధాని, కేంద్రమంత్రులను కోరామని వారు సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. గత ప్రభుత్వం హంగు, ఆర్భాటాలు చేసినా నేతన్నల జీవితాల్లో ఎలాంటి మార్పులు రాలేదని ఆత్మహత్యలు ఆగలేదని విమర్శించారు. పవర్‌లూమ్ రంగానికి ఉపాధి కల్పించే ఉద్దేశంతో నాణ్యత లేని బతుకమ్మ చీరలకు బదులుగా స్వయం సహాయక మహిళాసంఘాల్లోని 63లక్షల మంది మహిళా సభ్యులకు ఏటా రెండు చీరలను పంపిణీ చేస్తామని సీఎం ప్రకటించారు. తమ ప్రభుత్వానికి రైతన్న, నేతన్న ఒక్కటేన్నన్న రేవంత్, చేనేతలకు సంబంధించిన రూ.30 కోట్ల రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు.తెలంగాణలో కుల ,చేతి వృత్తులకు సముచిత న్యాయం చేస్తామన్నారు.

తెలంగాణ కోసం పోరాడిన కొండా లక్ష్మణ్‌బాపూజీ పేరును ఐఐహెచ్‌టీకి పెడతామని సీఎం ప్రకటించారు. కొండా లక్ష్మణ్ పదవులు త్యాగం చేస్తే, కొందరు ఉపఎన్నికల పేరుతో కలెక్షన్లు, సెలక్షన్లతో కోట్లు సంపాదించారని ఆరోపించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడి, త్యాగం చేశారని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే కాదు కేసీఆర్‌కు నిలువ నీడనిచ్చి పార్టీ పెట్టినపుడు మొట్టమొదట కార్యాలయం పెట్టుకోవడానికి స్థలం ఇచ్చింది కూడా ఆయనే అని గుర్తు చేవారు. 1969లో తెలంగాణ రాష్ట్రం వచ్చేవరకూ పదవులను చేపట్టనని ఆనాడు ఎమ్మెల్యేగా, మంత్రిగా రాజీనామా చేసిన మహామనిషి అన్నారు. అలాంటిది నేడేమో కొందరు రాజీనామాలు చేయటం, ఎలక్షన్లు తేవటం, సెలక్షన్ చేయటం, కలెక్షన్ చేసుకోవడం త్యాగమని చెప్పుకుంటున్నారని సిఎం – రేవంత్‌రెడ్డి, విమర్శించారు. నేతన్నలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు పరిష్కరించి వారి జీవితాలల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్టర చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. చేనేతల ట్రేడ్ మార్క్‌కోసం ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News