Wednesday, April 17, 2024

మోగింది ఎన్నికల నగారా

- Advertisement -
- Advertisement -

భారత్, అమెరికా సహా ప్రపంచం మొత్తంలో సగం జనాభా గల 50 కంటే ఎక్కువ దేశాలలో 2024లో ఎన్నికలు జరుగబోతుండడం విశేషం. భారత ఎన్నికల కమిషన్ సమాచారం ప్రకారం 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి అర్హులైన నమోదిత ఓటర్ల సంఖ్య 89.6 కోట్లు కాగా, జనవరి 1, 2024 నాటికి ఆ సంఖ్య 96.88 కోట్లకు చేరుకున్నది. మార్చి 10, 2024 నాటికి మొత్తం నమోదిత ఓటర్లు 81,87,999 మంది. 85 నుంచి 100 సంవత్సరాలు పైబడిన వయోజనులు 2,18,442 మంది వృద్ధులు కావడం విశేషం. 17వ లోక్‌సభకు 2019లో జరిగిన ఎన్నికలలో యువతరం, విద్యావంతులు, మహిళా ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొనడంతో పాటు పోటీ చేయడం కూడా విశేషం. 17వ లోక్‌సభ (జూన్ 2019 మే 2024) ను దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా పేర్కొనవచ్చు. భారత్‌లో జరిగే 2024 సార్వత్రిక ఎన్నికలను ప్రజాస్వామ్య చరిత్రలో నిర్వహింపబడుతున్న అతి పెద్దవిగా అభివర్ణించవచ్చు. ఈ ఎన్నికలు అమెరికాను మించిపోవడమే కాదు, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి.

2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో 90 కోట్ల అర్హులైన ఓటర్లను ఆకర్షించడానికి వివిధ రాజకీయ పార్టీలు, అభ్యర్థులు 8.7 బిలియన్ల అమెరికా డాలర్లను వెచ్చించారంటే ఆశ్చర్యం కలుగకమానదు. ఈ ఎన్నికలలో 673 పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తూ 8,054 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్న సమయంలో ఓటర్లను ప్రభావితం చేయడానికి అక్రమంగా తరలిస్తున్న దాదాపు రూ. 3100 కోట్ల విలువ గల మద్యం, నగదు, బంగారం, మత్తు పదార్థాలు వగైరాలను ఎన్నికల సంఘం జప్తు చేయడం విస్మయం కలిగిస్తుంది. ఉభయ సభలను నడపడానికి తీసుకునే పన్ను చెల్లింపుదారుల డబ్బు కంటే పార్లమెంట్‌లో అంతరాయాలకు ఎక్కువ ఖర్చవుతున్నది. మార్చి 2023లో లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ పిడిటి ఆచారి ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ పార్లమెంటు కార్యకలాపాలు నిర్వహించడానికి భవనం నిర్వహణ, విద్యుత్, నీరు, పెట్రోల్, ఆహారం, పార్లమెంటు భద్రత, ఎంపిలు, వారి అంగరక్షకులు, పార్లమెంట్ సిబ్బంది, ఉద్యోగులందరి జీతభత్యాలు వంటి ఇతర నిర్వహణ ప్రత్యక్ష,

పరోక్ష ఖర్చుల నిమిత్తం నిమిషానికి దాదాపు రూ. 2.5 లక్షలు ఖర్చవుతుందని వివరించారు. ప్రజల నుండి పన్నుల రూపంలో సేకరించిన ప్రజా ధనం దుర్వినియోగానికి ఉదాహరణగా 2021లో వర్షాకాల సమావేశాల సందర్భంగా నిర్ధారిత 107 గంటలలో కేవలం 18 గంటలు పార్లమెంటు కార్యకలాపాలు కొనసాగాయి. ఫలితంగా పన్ను చెల్లింపుదారుల విలువైన రూ. 133 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సాధారణంగా పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ప్రతి రోజు, ఉభయ సభలలో దాదాపు ఆరు గంటల పాటు కార్యకలాపాలు నిర్వహించబడతాయి. 1978కి ముందు రెండు సభల ఉత్పాదకత 100% మార్కును దాటింది. ప్రాంతీయ పార్టీలు, గ్రామీణ రాజకీయాల పెరుగుదలతో, పార్లమెంటులో చర్చ గణనీయంగా పెరిగి, కొన్ని సార్లు నిరసనకు దారితీస్తుందని చాలా మంది పార్లమెంటు సభ్యులు భావిస్తున్నారు. ఉత్పాదకత రేటు తగ్గడానికి ప్రధాన కారణం నినాదాలు, నిరసనల కారణంగా సమావేశాలలో అంతరాయం ఏర్పడిందని భావిస్తున్నారు. 2017-18లో పార్లమెంటు శీతాకాల సమావేశాలకు అంతరాయం

కలగడంతో ప్రభుత్వ ఖజానాకు 140 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. దీంతో పార్లమెంటు పనితీరుపై పన్ను చెల్లింపుదారులలో తీవ్ర అసంతృప్తి చెలరేగింది. 2019 బడ్జెట్ సమావేశాలలో, లోక్‌సభ ఉత్పాదకత 137 శాతానికి, రాజ్యసభ 103 శాతానికి చేరుకుంది. లోక్‌సభ 480 గంటల పాటు అద్భుతంగా పని చేసింది. 37 సెషన్‌లలో, వాయిదాలు, అంతరాయాల కారణంగా సమయం కోల్పోలేదు. దీనిని ఆహ్వానిస్తూ పన్ను చెల్లింపుదారులు అధికార, ప్రపంచ వ్యాప్తంగా 1960వ దశకం చివరి వరకు 77 శాతం పైగా పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకోగా, 2010 తర్వాత సగటు ఓటింగ్ శాతం 67 కంటే తక్కువకు చేరడం గమనార్హం. ఓటర్లను నాయకులు తమను అందలానికి ఎక్కించే సాధనాలుగా కాక ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపి వారికి మానసికంగా దగ్గరయ్యే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఓటర్లలో ఉదాసీనత తగ్గి నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిఢవిల్లడంతో పాటు ఓటింగ్ శాతంలో వృద్ధి నమోదవుతుంది.అంతేకాదు పౌరులు తమ హక్కులతో పాటు బాధ్యతలను గుర్తెరిగి ప్రశ్నించేతత్వం అలవర్చుకుని దేశాభివృద్ధికి తోడ్పాటునందించిన నాడు, ప్రజాప్రతినిధులలో జవాబుదారీతనం పెరిగి దేశ విశాల ప్రయోజనాల కోసం శ్రమించిన నాడు భరత జాతి కీర్తి ఖండాంతరాలను దాటుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News