Friday, December 1, 2023

మహిళా బిల్లుకు జై..

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ : తీవ్రస్థాయి, వాడివేడి చర్చల అనంతరం బుధవారం లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందింది. లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం కోటా కల్పించే ఉద్ధేశంతో ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రతిపక్షానికి చెందిన పలువురు ప్రముఖ మహిళా నేతలు, కేంద్రం తరఫున మంత్రి స్మృతి ఇరానీ ఇతరులు బిల్లుపై జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. తమ వా దనను విన్పించారు. తరువాత బిల్లును సభ ఆమోదానికి కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. పార్లమెంట్ కొత్త భవనంలో తీసుకువచ్చిన తొలి బిల్లు, అందులోనూ దేశంలో చారిత్రక బిల్లు ఆ మోదం పొందింది. బిల్లుకు జరిగిన ఓటింగ్‌లో అనుకూలంగా 454 మంది ఎంపిలు మద్దతు పలికారు. కేవలం ఇద్దరు ఎంపిలు వ్యతిరేకించారు. గురువారం ఈ బిల్లును ఎగువ సభలో ప్రవేశపెడుతారు.

‘నారీశక్తి వందన్ అధినియం పేరిట ప్రభుత్వం మంగళవారం ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. గడిచిన పాతికేళ్లుగా మహిళా రిజర్వేషన్ల కోటా కోసం పలుమార్లు ప్రతిధ్వనిస్తూవచ్చిన వాణి ఇప్పుడు కార్యరూపం దాల్చే దిశలో కీలక ముందడుగు వేసింది. పార్టీల మధ్య ఏకాభిప్రాయ సాధన కోసం ఇన్నేళ్లుగా యత్నిస్తూ వచ్చారు. కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ చర్చ దశలో ఈ బిల్లుకు తమ పార్టీ తరఫున మద్దతు ఉంటుందని ప్రకటించారు. బిల్లును వెంటనే అమలులోకి తేవాలని, ఇందులో ఒబిసి ఉమెన్ కోటా కూడా చేర్చాలని డిమాండ్ చేశారు. అయితే దేశంలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ, జనాభాలెక్కల ప్రక్రియ తరువాత బిల్లు చట్టరూపంలో అమలులోకి వస్తుందని, అప్పటి నుంచి 15 సంవత్సరాల పాటు కొనసాగుతుందని ప్రభుత్వం బిల్లులో తెలిపింది.

అయితే డిలిమిటేషన్, సెన్సస్ వంటి భారీ ప్రక్రియలతో బిల్లు ఉద్ధేశం నెరవేరబోదని, ఈ అడ్డంకులు లేకుండా ముందు దీనిని వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటి నుంచే అమలులోకి తీసుకురావాలని ప్రతిపక్షాలు కోరాయి. బిల్లును తెచ్చినట్లే, కో టా ఇచ్చినట్లే చేసి సాకులతో దాటవేతలకు దిగుతున్నార ని మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అయితే మహిళ గణనీయ శక్తిగా మార్చే దిశలో మోడీ ప్రభుత్వం ఈ చారిత్రక బిల్లు తీసుకువచ్చిందని అధికార పక్ష సభ్యులు స్పష్టం చేశారు.
మజ్లిస్ ఎంపిలిద్దరి వ్యతిరేక ఓటు?
మహిళా రిజర్వేషన్ బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో దీనికి వ్య తిరేకంగా ఓటేసిన ఇద్దరు ఎంపిలు మజ్లిస్ పార్టీకి చెంది న వారే అని వెల్లడైంది. హైదరాబాద్ ఎంపి , మజ్లిస్ నేత అసదుద్దిన్ ఒవైసీ, ఈ పార్టీకే చెందిన ఔరంగాబాద్ ఎం పి ఇంతియాజ్ జలీల్ ఉన్నట్లు తెలిసింది. ఈ బిల్లు ప్ర స్తు త రూపంలో తమకు సమ్మతం కాదని ఒవైసీ తెలిపారు.
వచ్చే ఏడాది ఎన్నికల తరువాతనే : అమిత్ షా
ప్రస్తుత సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ బిల్లు అమలులోకి వచ్చేది వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల తరువాతనే అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా బిల్లుపై చర్చ దశలో పరోక్షంగా తెలిపారు. బిల్లు అమలుకు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ జరగాల్సి ఉంది. జనగణన చేపట్టాలి. ఇది వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల తరువాతనే చేపట్టడం జరుగుతుందని ఆయన వివరించారు. బిల్లుపై ప్రతిపక్షాలకు చిత్తశుద్ధి లేదని, చిత్తశుద్ధి ఉందని నిరూపించుకోవాలనుకుంటే బిల్లును ఏకగీవ్రంగా ఆమోదించాల్సి ఉంటుందని సవాలు విసిరారు. ప్రతిపక్షాలు ఏదో విధంగా బిల్లును అడ్డుకోవాలని చూస్తున్నాయని విమర్శించారు. ఈ కీలక అంశంపై కూడా రా జకీయాలకు దిగుతున్నారని స్పందించారు. మహిళా కో టా బిల్లు ప్రయాణం సుదీర్ఘమైనదన్నారు.

తొలుత యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం సమయంలో అప్పటి ప్రధాని దేవెగౌడ దీనిని తీసుకువచ్చారు. తరువాత మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టారు. కారణాల జోలికి వెళ్లదల్చుకోలేదు కానీ , ఇప్పుడు ఈ బిల్లు సరైన రీతిలో ముందుకు వచ్చిందని తెలిపారు. బిల్లును ఏకాభిప్రాయ సాధనతో ఏకగ్రీవంగా ఆమోదించాల్సి ఉందని, లోపాలు ఏమైనా ఉంటే తరువాతి దశల్లో సవరించుకోవచ్చునని సభ్యులకు తెలిపారు. బిల్లు అమలులో జాప్యం జరుగుతుందనే వాదనను తోసిపుచ్చారు. తరువాత వచ్చే ప్రభుత్వం సంబంధిత డిలిమిటేషన్, సెన్సస్ ప్రక్రియలు చేపడుతుందన్నారు. ఈ బిల్లు దేశంలో నూతన అధ్యాయానికి దారితీస్తుందని తెలిపా రు. ప్రధాని మోడీ ఇటీవలి జి 20 సదస్సులో ఆవిష్కరించిన మహిళా సారధ్య దేశ ప్రగతి దిశలోనే ఈ బిల్లు ఉందని తెలిపారు. మోడీ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన నా టి నుంచి మహిళా సాధికారికతకు, మహిళల పట్ల ఆదరణకు పాటుపడుతూ వస్తోందని చెప్పారు.

మహిళ భద్రత, గౌరవం, సమాన ప్రాతినిధ్యం కోసం కృషి సాగుతోందన్నారు. బిల్లు తీసుకురావడానికి జరిగిన ఐదో ప్రయత్నం ఇదని వివరించారు. నాలుగు సార్లు పార్లమెంట్ మహిళ ను నిరాశపర్చిందని, ఈసారి ఈ విధంగా జరగనిచ్చేది లే దన్నారు. ఈ సందర్భంగా ఈ బిల్లు పూర్వాపరాలను వివరించారు. తొలుత ఈ బిల్లును 1996లో హెచ్‌డి దేవెగౌడ ప్రభుత్వం తీసుకువచ్చింది. తరువాత ఇది కాలం చెల్లిం ది. రెండోసారి దీనిని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2008లో సంబంధిత బిల్లును యుపిఎ తీసుకువచ్చింది. అయితే అప్పటి లోక్‌సభ రద్దుతో ఈ బిల్లు చెల్లకుండా పోయిందని తెలిపారు.
ఒబిసి కోటా లేకుంటే అసంపూర్ణమే : రాహుల్
బిల్లును ప్రభుత్వం ఆమోదింపచేసుకుంటే సరిపోదని, దీ నిని వెంటనే అమలులోకి తీసుకురావాల్సి ఉందని కా్ంర గెస్ నాయకులు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఒబిసి మహిళకు ఉపకోటా లేకుండా బిల్లు పరిపూర్ణత సాధ్యం కాదన్నారు. మహిళా బిల్లుపై బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. దేశంలో కులాలవారి జనగణన అవసరం అని, దీనితోనే సామాజిక న్యాయానికి దారితీస్తుందన్నారు. బిసిలకు ప్రభుత్వాలలో తీరని అన్యాయం జరిగిందని , భారత ప్రభుత్వ పరిధిలో ని మొత్తం 90 మంది సెక్రెటరీల స్థాయిల్లో ఒబిసికి చెం దిన వారు కేవలం ముగ్గురే ఉన్నారని తెలిపారు. ఇక బడ్జె ట్ కేటాయింపులలో ఒబిసిలకు దక్కేది కేవలం ఐదు శా తం అని ఇది బిసిలకు అవమానం అని విమర్శించారు.

వారిపట్ల ఎప్పటికి న్యాయం జరుగుతుందని నిలదీశారు. పరపాలన నుంచి విముక్తి పొందడం అంటే దేశ ప్రజలకు , చెందాల్సిన వారికి అధికారం చెందడం అని , అధికార మార్పిడి ఈ విధంగా జరిగిందా? అని ప్రశ్నించారు. ఈ బిల్లు చాలా కీలకమైనదని చెప్పిన రాహుల్, దేశంలోని అత్యధిక సంఖ్యలో ఉండే మహిళలకు ఈ బిల్లులో సరైన వాటా దక్కాల్సి ఉందన్నారు. దీనిని ఈ బిల్లులో పొందుపర్చలేదని నిరసన వ్యక్తం చేశారు. వెనువెంటనే లోక్‌సభ, విధానసభలలో మహిళకు 33 శాతం కోటా కేటాయించాల్సి ఉందని డి మాండ్ చేశారు. ఇప్పటికీ అదానీ విషయం రగులుతోంది. ఇటువంటి వాటి నుంచి ఏదో విధంగా చర్చ ను పక్కదోవ పట్టిస్తూ ఉంటారని విమర్శించారు.
నెమళ్లు, తివాచీలు అంతా బాగా ఉంది కానీ
పార్లమెంట్ కొత్త భవనం అత్యద్బుతంగానే ఉంది. అందమైన నెమ్మళ్లు, నేలపై నెమ్మళ్ల ఈకలు, చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అంతా బాగుంది. అయితే పార్లమెంట్ ఆవిష్కరణలో దేశ రాష్ట్రపతి ప్రాతినిధ్యం లేకపోవడం వి కృతం అని విమర్శించారు. పార్లమెంట్ కొత్త భవనం ఆ రంభం పద్ధతి ప్రకారం జరిగిందా? అని నిలదీశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News