Monday, May 6, 2024

లోకేశ్ ఎ14

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : అమరావతి ఇన్న ర్ రింగ్ రోడ్డు కేసులో హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లి మిటెడ్‌పై ఎపి సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. అమరావతి ఇన్నర్‌రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్‌ను ఎ14గా ఎపి సిఐడి చేర్చింది. లోకేశ్‌పై కోర్టులో దాఖలు చేసిన మెమోలో ఎపి సిఐడి అధికారులు కీలక విషయాలను ప్రస్తావించారు. ఈ కేసులో ఎ1గా ఉన్న చంద్రబాబును లోకేశ్ ప్రభావితం చేశారని సిఐడి ఆరోపిస్తోంది. అమరా వతి రాజధాని అలైన్‌మెంట్ ను మార్పులు చేసి త మ భూముల విలువ పెరిగేలా చేశారని సిఐడి ఆ రోపించిన విషయం విదితమే. రాజధాని ప్రకటన కు ముందే వేరే వ్యక్తులతో తుళ్లూరు, మండలం ప్రాంతాల్లో స్థలాలు కొనుగోలు చేశారని సిఐడి అ భియోగాలు మోపింది. రాజధాని ప్రకటన తర్వా త ఈ భూములను హెరిటేజ్ సంస్థకు మార్పిడి చే సుకున్నారని సిఐడి ఆరోపించింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్‌లో లింగమనేని రమేష్‌కు కూడ లబ్ది కలిగించేలా వ్యవహరించార ని సిఐడి ఆరోపించింది.అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పుల విషయంలో తమ వారికి ప్రయోజనం పొందేలా వ్య వహరించడంలో లోకేష్ కీలకంగా వ్యవహరించారని ఆరోపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News