Tuesday, April 30, 2024

సింగరేణి కార్మికులకు సిరుల పంట

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : సింగరేణి కార్మికులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. సిఎం కేసిఆర్ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థలో 2022–23 ఆర్థ్దిక సంవత్సరానికి వచ్చిన లాభా ల్లో రూ .711 కోట్లు (32 శాతం) ఇవ్వాలని నిర్ణయించింది. త్వరలో ఈ మొత్తం నిధులు ఉద్యోగుల ఖాతాలో జమ కానున్నాయి. దీంతో సింగరేణి సంస్థలో పని చేస్తున్న సుమారు నాలుగు వేల మందికి ప్రయోజనం చేకూర నుంది. అంతే కాకుండా ముఖ్యమంత్రి కెసిఆర్ గతంలో ప్రకటించిన విధంగా సింగరేణి కార్మికులకు దసరా బోనస్ రూ.700 కోట్లను అందించేందుకు యాజమాన్యం కసరత్తు చేస్తోంది. ఇవన్నీ కలిపితే సింగరేణి ఉద్యోగులకు రూ. 1411 కోట్ల ప్రయోజనం చేకూరినట్లే. వారం రోజుల క్రితమే సింగరేణి కార్మికులకు 11 వేజ్ బోర్డు బకాయిలు రూ. 1450 కోట్లను విడుదల చేసింది. వీరిలో కొంత మందికి నాలుగు నుంచి ఐదు లక్షల వరకు ప్ర యోజనం చేకూరగా మరో నలుగురు రూ.6 నుంచి 9 లక్షల వరకు ప్రయోజనం చేకూరిన సం గతి తెలిసిందే.

గతంలో ఎన్నడూ లేని విధంగా సింగరేణి సంస్థ ఒకేసారిగా ఎరియర్స్ ను కార్మికుల ఖాతాల్లో జమ చేసింది.మొదట రెండు దఫాలుగా ఎరియర్స్ చెల్లించాలని భావించినప్పటికీ, సంస్థ ఛైర్మన్, ఎండి ఎన్.శ్రీధర్ ఆదేశం మేరకు ఒకే విడతలో ఎరియర్స్ చెల్లింపులు పూర్తి చేశారు. కార్మికులకు చెల్లించే ఎరియర్స్‌లో ఇన్ కంటాక్స్, సీఎంపిఎఫ్, పెన్షన్‌కు చెల్లించాల్సి ఉన్న సొమ్ము ను మినహాయించి మిగిలిన మొత్తాన్ని కార్మికుల ఖాతాల్లో జమ చేశా రు. 11వ వేజ్ బోర్డు జీతాలను కూడా సింగరేణి సంస్థ కోల్ ఇండియా కన్నా ముందే అమలు జరిపిన సంగతి తెలిసిందే. 11వ వేజ్ బోర్డు ఎరియర్స్ కోల్ ఇండియాలోని కొన్ని సబ్సిడరీ కంపెనీలు ఇంకా చెల్లించలేదు. దశలవారీగా చెల్లించడానికి సమాయత్తం అవుతున్నట్లు సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News