Wednesday, October 9, 2024

ప్రేమ జంట ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

పెద్దలు తమ ప్రేమను అంగీకరించలేదని మనస్తాపం చెంది ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా, దోమకొండ మండలంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం .. కోనాపూర్ గ్రామానికి చెందిన మోగిలి సాయికుమార్ తమ వ్యవసాయ బావి వద్ద శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

అదేవిధంగా ఇదే మండలంలోని అంబారిపేట గ్రామానికి చెందిన రంగోలు వీణ అనే యువతి తమ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతులిద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని, వారి ప్రేమకు పెద్దలు అగీకరించరని భావించి ఆత్మహత్యకు పాల్పడినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని ఎస్‌ఐ తెలిపారు. ఇద్దరు మృతుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News