Saturday, October 12, 2024

రేపు లోయర్ మానేరు గేట్లు ఎత్తివేత..లోతట్టు ప్రాంతాలు అప్రమత్తం

- Advertisement -
- Advertisement -

గోదావరి బేసిన్ పరిధిలో ఉన్న లోయర్ మానేరుకు ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద నీరు చేరటంతో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండిపోయింది. ప్రాజెక్టులో నీటినిలువ 23.95టిఎంసీలకు చేరుకుంది. నీటిమట్టం 919..9అడుగుల గరిష్ట స్థాయికి పేరింగింది. ఉన్నతాధికారుల సూచనలు మేరకు సోమవారం ఉదయం 9.00 గంటలకు లోయర్ మానేరు డ్యామ్ వరద గేట్లు ఎత్తి సుమారు 5000 క్యూసెక్కుల నీటిని మానేరు నది లోనికి వదులుటకు నిర్ణయించినట్టు ప్రాజెక్టు ఈఈ పి.నాగభూషణరావు వెల్లడించారు. రెవిన్యూ , పోలీస్ శాఖ అధికారులు తగు ముందు జాగ్రత్త చర్యలు తీసొకొవలసిందిగా,

మానేరు ప్రాజెక్టు దిగువన నదీపరివాహకంగా ఉన్న సమీప లోతట్టు గ్రామాలలో దండోరా వేయించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. నదీ పరివాహక ప్రాంతం లోకి పశువులు ,గొర్రెలు మొదలగునవి వెళ్లకుండా చూడాలని, అలాగే చేపలు పట్టేవారు, గొర్రె కాపరులు రైతులు నది వైపు వెళ్లకుండా అప్రమత్తం గా ఉండాలని హెచ్చరించారు. లోయర్ మానేరు జలాశయం దిగువ పరివాహక ప్రాంతాల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయవలసిందిగా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా మిత్రులకు పోలీస్,రెవెన్యూ అధికారులకు , ప్రజాప్రతినిధులకు విజ్ణప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News