Friday, September 13, 2024

రోహిత్ శర్మకు రూ.50 కోట్లా?.. లక్నో ఓనర్ క్లారిటీ

- Advertisement -
- Advertisement -

2025 ఐపిఎల్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ముంబై జట్టును వీడనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రోహిత్ మెగా వేలంలోకి వస్తాడని ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో రోహిత్ శర్మను రూ.50 కోట్లు వెచ్చించి లక్నో సూపర్ జాయింట్(ఎల్ఎస్ జి) దక్కించుకోనుందని పలు మీడియాలో కథనాలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై లక్నో ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయెంకా స్పందించారు. ఉన్న మెత్తం అమౌంట్ లో ఒక్క ఆటగాడికే సగం డబ్బులు ఖర్చు చేస్తే.. మిగతా ఆటగాళ్లను ఎలా కొనగలం?.. అసలు రోహిత్‌ను ముంబై ఇండియన్స్ జట్టు వదిలేస్తుందో లేదో తెలియదు. వేలానికి వస్తాడో రారో అనే దానిపై క్లారిటీ లేదు. అలాంటప్పుడు రూ.50 కోట్లు అనేది ఊహాగానమే. ఎలాంటి ఆధారాలు లేకుండానే రూమర్స్‌ వస్తున్నాయి’ అని క్లారిటీ ఇచ్చారు.

కాగా, గత ఐపీఎల్ లక్నో జట్టు ఘోరంగా విఫలమైంది. దీంతో ప్రాంచైజీ ఓనర్ సంజీవ్‌ గోయెంకా ఆటగాళ్లపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. లీగ్ దశలో హైదరాబాద్ పై ఘోర ఓటమి తర్వాత మైదానంలోనే కెప్టెన్ కెఎల్ రాహుల్ కు సంజీవ్ క్లాస్ తీసుకున్నాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాహుల్ తో సంజీవ్ ప్రవర్థించిన తీరును అందరూ తప్పుబట్టిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News