Thursday, March 28, 2024

ప్రపంచం లోనే అత్యంత వృద్ధురాలు.. 118వ ఏట కన్నుమూసిన ఫ్రెంచి సన్యాసిని లూసిల్

- Advertisement -
- Advertisement -

పారిస్ : ప్రపంచం లోనే అత్యంత వృద్ధురాలు, సిస్టర్ ఆండ్రీగా గుర్తింపు పొందిన ఫ్రెంచి సన్యాసిని సిస్టర్ లూసిల్ రాండన్ (118) మంగళవారం రాత్రి 2 గంటల సమయంలో టొలాన్ నగరం లోని తన సెయింట్ కేథరిన్ లేబర్ నర్సింగ్‌హోమ్‌లో కన్నుమూశారని ఆమె ప్రతినిధి డేవిడ్ తనెల్లా వెల్లడించారు. మరో నెల రోజుల్లో 119 వ పుట్టిన రోజు ఆమె జరుపుకోవలసి ఉండగా ఇంతలో ఆమె మరణించడం గమనార్హం. 1904 ఫిబ్రవరి 11 న జన్మించిన రాండన్ అసలు పేరు లూసిల్ రాండన్. 1944 లో సిస్టర్ ఆండ్రీగా మారిన ఆమె 1918లో స్పానిష్ ఫ్లూ మహమ్మారి నుంనచి బయటపడ్డారు. 2021లో తన 117 వ పుట్టిన రోజుకు ముందుగా కొవిడ్ మహమ్మారి నుంచి బయటపడిన అత్యంత వృద్ధురాలిగా గుర్తింపు పొందారు.

అయినా కొన్ని లక్షణాలు ఉన్నప్పటికీ తాను కొవిడ్ బాధితురాలిగా ఆమె అనుకోలేదు. రెండు ప్రపంచ యుధ్ధాలను కళ్లారా చూసిన ఆమె తన ప్రత్యేక సుదీర్ఘ జీవనానికి కారణం ఏమిటని అడగ్గా “ పని మిమ్మల్ని బతికిస్తుంది… నేను 108 ఏళ్ల వరకు పని చేశాను ” అని ఫ్రెంచి మీడియాకు ఆమె చెప్పింది. రోజూ గ్లాసుడు వైన్, చాకొలేట్ తీసుకోవడం ఆమెకు అలవాటు. ఉపాధ్యాయురాలిగా, గవర్నర్‌గా పనిచేశారు. విచీ, ఆవెర్గేరోస్‌ఆల్ఫ్ లోని ఆస్పత్రిలో 28 ఏళ్ల పాటు అనాథలు, వృద్ధులకు సేవలు అందించారు. ఇప్పటివరకు నమోదైన ఫ్రెంచ్, యూరోపియన్ వృద్ధుల్లో ఆండ్రీ మూడో వ్యక్తిగా రికార్డుల్లో నిలిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News