Saturday, April 20, 2024

‘లంపీస్కిన్’ కలకలం

- Advertisement -
- Advertisement -

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పశువుల్లో వైరస్ లక్షణాలు

రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపిన పశు యజమానుల ఆందోళన

మన తెలంగాణ/బోధన్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో లంపీస్కిన్ వైరస్ కలకలం రేపుతోంది. పశువులకు సొకుతున్న ఈ ప్రమాదకరమైన వైరస్ నవీపేట మండలంలో బయటపడింది. ఇంతకుముందు కూడా నవీపేట మండలంలోని తుంగి ని, నాళేశ్వర్ గ్రామాల్లో ఈ వైరస్ లక్షణాలు ఉన్న పశువులు కనిపించడం ఆందోళన కలిగించాయి. ఈ వైరస్ ప్రమాదకరంగా మారడంతో జిల్లాలోని పశు యజమానుల్లో ఆందోళన నెలకొంది. ఈ వైరస్ పశువులకు సొకగానే ఒంటిపైన దద్దుర్లు, చర్మ సంబంధమైన లక్షణాలు వెలుగు చూస్తాయి. పశువుల ఒంటిపైన తీవ్రస్థాయిలో దద్దుర్లు ఏర్పడతాయి. ఈ లక్షణాలు ఉన్న పశువులను ప్రాథమిక స్థాయిలో గుర్తించకపోతే మిగతా పశువులకు ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది.

లంపీస్కిన్ వైరస్ సోకిన పశువుల మాంసాన్ని తింటే ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. ఇదిలాఉంటే నవీపేట మండలంలో పశువుల్లో వైరస్ లక్షణాలు వెలుగు చూడడంతో పశు వైద్యశాఖ అప్రమత్తమైంది. అధికారులు ఆయా గ్రామాల్లో పర్యటించి పశువుల రక్త నమూనాలను సేకరించారు. లంపీస్కిన్ వైరస్ లక్షణాలు పశువుల్లో వెలుగు చూడటం పశు యజమానుల్లో ఆందోళన కలిగిస్తుంది. లక్షల రూపాయల విలువ చేసే పశువులకు ఈ వ్యాధి సోకితే తమకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశు వైద్య శాఖ అధికార యంత్రాంగం వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి తమ పశువులను కాపాడాలి అని కోరుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News