Friday, September 13, 2024

గుడి గోడ కూలి 9 మంది చిన్నారులు మృతి

- Advertisement -
- Advertisement -

భోపాల్: ఓ దేవాలయం గోడ కూలి తొమ్మిది మంది చిన్నారులు మృతి చెందిన సంఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రం సాగర్ జిల్లాలోని షాపూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… షాపూర్ గ్రామంలో హర్ దయాల్ దేవాలయం వద్ద శివుడికి వేడుకలు జరుపుతుండగా చిన్నారులపై గోడ కూలింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది చిన్నారులు చనిపోగా మరి కొంత మంది గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగించి గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. శనివారం రేవా జిల్లాలో ఓ ఇంటి గోడ కూలి నలుగురు మరణించిన విషయం తెలిసిందే. వారు పాఠశాల నుంచి ఇంటికి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News