Friday, December 6, 2024

బాలుడి గొంతు కోసి హత్య… ముగ్గురు మైనర్లు అరెస్టు

- Advertisement -
- Advertisement -

 

భోపాల్: ముగ్గురు మైనర్లు 12 ఏళ్ల బాలుడి గొంతుకు సైకిల్ చైన్‌తో ఉరి పెట్టి… గొంతు కోసి హత్య చేసి అనంతరం మృతదేహాన్ని పాలిథీన్ బ్యాగ్‌లో చుట్టి రాళ్ల కుప్పలపై పడేసిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం సియోని జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. మగర్కాతా గ్రామంలో ఆదివారం ముగ్గురు బాలర్లు (16 ఏళ్లు, 14 ఏళ్లు, 11 ఏళ్లు) 12 ఏళ్ల బాలుడిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. 12 ఏళ్ల బాలుడితో ముగ్గురు గొడవకు దిగి అనంతరం గొంతుకు సైకిల్ చైన్‌తో ఉరి పెట్టారు.

Also Read: 134 చెరువులు కబ్జా

బాలుడు కేకలు వేయడంతో తలపై రాయితో దాడి చేయడంతో అపస్మారక స్థితిలో వెళ్లిపోయాడు. అనంతరం ముగ్గురు కలిసి బాలుడి గొంతు కోసి హత్య చేశారు. మృతదేహాన్ని పాలిథీన్ కవర్‌లో చుట్టి గ్రామ శివారులోని రాళ్లకుప్పలో పడేశారు. అదే గ్రామానికి చెందిన మహిళ రక్తపు మరకలతో ఉన్న బ్యాగ్‌ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. మృతుడి సోదరికి నిందితుల్లో 16 ఏళ్ల బాలుడు చెప్పడంతో ఈ హత్య వెలుగులోకి వచ్చింది. పోలీస్ అధికారి శశికాంత్ సరేయమ్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి జువైనల్ హోమ్‌కు తరలించామని పోలీస్ ఇన్స్‌పెక్టర్ ప్రసన్న శర్మ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News