Sunday, April 28, 2024

కాళేశ్వరంలో మేడిగడ్డే కీలకం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో గత ప్ర భుత్వం అర్భాటంగా నిర్మించిన కాళేశ్వరం డిజైన్ లో ఎన్నో లోపాలున్నాయని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం మేడిగడ్డ బ్యారేజీ వద్ద నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ప్రాజెక్టుల డిజైన్‌లో లోపాలున్నాయని గతంలోనే చెప్పానని, కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైంది మేడిగడ్డ బ్యారేజీ అని ఆయన గుర్తు చేశారు. మేడిగడ్డ బ్యారేజీలో నీరు నిలిస్తేనే ఎక్కడికైనా ఎత్తిపోసేదని ఆయన చెప్పారు. మేడిగడ్డలో నే నీరు ఉండని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇక మిగిలిన జలాశయాలకు నీటిని ఎలా ఎత్తిపోస్తారని తుమ్మల ప్రశ్నించారు.

కెసిఆర్‌కు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు
కెసిఆర్‌కు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. నల్గొండ సభలో బిఆర్‌ఎస్ అధ్యక్షులు కెసిఆర్ మాట్లాడుతూ పాలిచ్చే బర్రెను వదులుకొని దున్నపోతుని తెచ్చుకున్నారనే వ్యాఖ్య ప్రజాస్వామ్యాన్ని ప్రజలు నిర్ణయాన్ని అపహస్యం చేయడమే అని భావించాల్సి వస్తుందన్నారు. వేదిక మీద పెద్ధ పెద్ధ వ్యాఖ్యలు చేసే మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం గురించి హేళనగా మాట్లాడటం ఆక్షేపణీయ ంగా ఉందన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడే భాష, ప్రజాస్వామ్య విలువలకు లోబడి లేదని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారన్నారు. ఓడిపోయిన 60 రోజులకే అధికారం గురించి ఇంత ఆరాటపడటం, అధికారాన్ని కోల్పోయి ఇంత అసహనానికి గురవడం మీ ఆంతర్యాన్ని చెప్పకుండానే తెలియజేస్తుందని, వాస్తవాలను మరచి మీరు చేస్తున్న వ్యాఖ్యలు దొంగే దొంగ అనట్లుగా ప్రజలు భావించే అవకాశంగా ఉందన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం పేరుతో జరిగింది అవినీతి కాక ఏమిటి ? మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగితే కెసిఆర్‌కు కనీసం బాధ్యత, బాధ ఉన్నట్లు కనపడకపోవడం విచారకరమన్నారు. కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయితే ఏమి పికనీయ పోయారు అంటూ కెసిఆర్ మాట్లాడడం ఎంత బాధ్యతారాహిత్యం ? అని విమర్శించారు. నల్లగొండకు పోయే ఓపికుంది కానీ ఇంటిపక్కనున్న అసెంబ్లీకి మాత్రం రారని, పజలెన్నుకున్న సభలో ప్రజా ప్రతినిధుల ప్రశ్నలకు జవాబు చెప్పేధైర్యం లేకనే శాసన సభకు రావడం లేదన్నారు. కృష్ణా నదీ జలాలను అప్పజెప్పినటువంటి, గోదావరీ జలాల వినియోగానికి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు విధ్వంసానికి మూల కారణం ఐన మీరే కనీసం 2 నెలల వయసు కూడా లేని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పు పట్టే తపనా, ఆరాటాన్ని ప్రజలు గమనిస్తున్నారని, మీ తొందరపాటు ఆరోపణల్ని జనాలు నమ్మే పరిస్థితులు లేవని, అసహనాన్ని మాని, ఇకనైనా కాస్త ఓపిక పడితే మంచిదని హితవు పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News