Monday, April 29, 2024

ఉదయనిధిపై పిటిషన్‌ను కొట్టివేసిన మద్రాసు హైకోర్టు

- Advertisement -
- Advertisement -

చెన్నై: డిఎంకెకు మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని పిలుపునిచ్చిన సమావేశంలో పాల్గొన్నందుకు తమిళనాడు మంత్రులు ఉదయనిధి స్టాలిన్, పికె శేఖర్‌బాబు, నీలగిరీస్ ఎంపి ఎ రాజాపై కో వారంటో(అనర్హులుగా ప్రకటించాలని) జారీచేయడానికి మద్రాసు హైకోర్టు బుధవారం నిరాకరించింది. ఈ ముగ్గురు డిఎంకె ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా కో వారంటోను జారీచేయడానికి జస్టిస్ అనితా సుమంత్ నిరాకరిస్తూ పిటిషన్లను కొట్టివేశారు. సనాతన ధర్మంపై దుయనిధి చేసిన ప్రకటనలు హేయంగా, విచ్ఛిన్నకరంగా ఉన్నాయని అన్నారు. ముగ్గురు డిఎంకె కో వారంటో జారీచేయాలని కోరుతూ హిందూ మున్నాని పిటిషన్ దాఖలు చేసింది.

సనాతన ధర్మాన్ని హెచ్‌ఐవి, ఎయిడ్స్, డెంగీ, మలేరియాతో పోలుస్తూ దాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉందని ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు హేయంగా, విచ్ఛిన్నకరంగా ఉండడమేగాక రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని ఈ వ్యాఖ్యలు, ఆలోచనలు తప్పుడు సమాచార వ్యాప్తికి దారితీస్తున్నాయని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా 2023 సెప్టెంబర్‌లో ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. డిఎంకె ఎంపి రాజా కూడా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఈ రకమైన వ్యాఖ్యలే చేశారు. ఉదయనిధి పాల్గొన్న సమావేశంలో మరో మంత్రి శేఖర్‌బాబు కూడా పాల్గొన్నారు. ఈ ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హిందూ మున్నాని కార్యవర్గ సభ్యులు కేసు దాఖలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News