Friday, September 19, 2025

అమెరికాలో మహబూబ్‌నగర్ వాసి మృతి

- Advertisement -
- Advertisement -

అమెరికాలో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన గొడవ నేపథ్యంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ప్రమాదవశాత్తు బులెట్ తగిలి మొహమ్మద్ నిజాముద్దీన్(29) అనే విద్యార్థి మృతి చెందాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్‌నగర్ పట్టణానికి చెందిన నిజాముద్దీన్ 2016లో ఉన్నత విద్య, ఉద్యోగం కోసం అమెరికా వెళ్లాడు. ఈ క్రమంలో అమెరికాలోని యూనివర్శిటి ఆఫ్ ఫ్లోరిడాలో ఎంఎస్ పూర్తి చేసి, ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆరు నెలల క్రితం ఉద్యోగ ఒప్పందం ముగియడంతో, పొడగింపు లేకపోవడంతో తన స్నేహితులతో కలిసి ఓ రూమ్‌లో ఉంటున్నాడు. ఈక్రమంలో ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ జరిగింది.

దీంతో వారిలో ఒకరు పోలీసులకు సమాచారం ఇవ్వగా, పోలీసులు గొడవ వద్దకు చేరుకుని ఆపే ప్రయత్నం చేశారు. అయినా గొడవ సద్దుమణగకపోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ప్రమాదవశాత్తు తూటా వెళ్లి నిజాముద్దీన్‌కు తగలడంతో ప్రాణాలు కోల్పొయాడు. నిజాముద్దీన్ మృతి చెందిన విషయాన్ని స్నేహితులు తల్లిదండ్రులకు తెలిపారు. విషయం తెలుసుకున్న చికాగోలో నివాసం ఉంటున్న మృతుడి మామయ్య ఘటనా స్థలికి వెళ్లారు. కాగా ఈ ఘటన ఎప్పుడు జరిగిందన్నదానిపై స్పష్టమైన సమాచారం లేదు. మృతుడు ఎనిమిది రోజుల క్రితం తల్లిదండ్రులతో మాట్లాడినట్లు స్థానికులు చెబుతున్నారు.

Also Read: ఉత్తరాఖండ్‌ లో వరద బీభత్సం..పలు గ్రామాలు జలమయం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News