Tuesday, March 21, 2023

మేఘా ను అభినందించిన మహారాష్ట్ర ప్రభుత్వం

- Advertisement -

హైదరాబాద్: మేఘా ఇంజనీరింగ్ సంస్థను మహారాష్ట్ర ప్రభుత్వం అభినందించింది. ఎండిపివి కృష్ణారెడ్డి, డైరెక్టర్ సుబ్బయ్యలకు మహారాష్ట్ర సిఎం ఏకనాథ్ షిండే, డిప్యూటీ సిఎం ఫడ్నవీస్‌లు ప్రశంసా పత్రాన్ని అందించారు. ముంబై టు నాగ్‌పూర్ రహదారిని మేఘా సంస్థ పూర్తి చేయడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ సంస్థను అభినందించింది. ఆదివారం నాగపూర్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్రమోడీ హిందూ హృదయసామ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్‌లోని రెండు ప్యాకేజీ పనులను 85.40 కిలోమీటర్లు మేఘా ఇంజనీరింగ్ సంస్థ (ఎంఈఐఎల్) చేపట్టి పూర్తి చేసింది. ఈ ఎక్స్‌ప్రెస్ రోడ్డు నిర్మాణం వల్ల విదర్భ, మార్వాడ, ఉత్తర మహారాష్ట్రల అభివృద్ధికి ఆస్కారం కలుగుతుందని మహారాష్ట్ర సిఎం పేర్కొన్నారు.
నాగ్‌పూర్ టు షిర్డీ ఎక్స్‌ప్రెస్‌వే మొదటిదశ పనులు పూర్తి
ఈ రోడ్డు నిర్మాణం వల్ల నాగ్‌పూర్ టు -ముంబైల మధ్య ప్రయాణ సమయం ఏడు గంటలకు తగ్గుతుండగా, ప్రస్తుతం నాగ్‌పూర్ నుంచి షిర్డీ ఎక్స్‌ప్రెస్‌వే మొదటి దశ పనులు పూర్తయ్యాయి. శివమడక నుంచి నాగ్‌పూర్‌లోని ఖడ్కీ అమ్‌గావ్ వరకు 31 కి.మీల విస్తీర్ణంలో మేఘా సంస్థ నిర్మాణ పనులను చేపట్టి పూర్తి చేసింది. ఈ 31 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎంఈఐఎల్ 18 మైనర్ బ్రిడ్జి, 3 ఇంటర్‌ఛేంజ్‌లు, 3 ఫ్లైఓవర్, 2 వయాడక్ట్‌లు, 9 వెహికల్ అండర్‌పాస్‌లు, 12 పాదచారుల అండర్‌పాస్‌లు, 04 లైట్ వెహికల్ అండర్‌పాస్‌లు, 6 కాలువ వంతెనలు , 58 బాక్స్ కల్వర్టులు, 27 యుటిలిటీ కల్వర్టులు, 1 వైల్ యానిమల్ ఓవర్‌పాస్‌లు ఉన్నాయి.
రెండో సెగ్మెంట్‌లో 54.40 కి.మీల
రెండో సెగ్మెంట్‌లో దాదాపు 54.40 కి.మీల రోడ్డును ఎంఈఐ ఎల్ పూర్తి చేసింది. ఔరంగాబాద్ జిల్లాలోని బెండేవాడి గ్రామం నుండి ఫతివాబాద్ గ్రామం వరకు రోడ్డును ఎంఈఐఎల్ నిర్మించింది. ఈ రహదారిపై 1 ప్రధాన వంతెన, 32 చిన్న వంతెనలు, ఒక సొరంగం , ఇంటర్‌చేంజ్‌ను మేఘా నిర్మించింది. 4 వయాడక్ట్, 69 బాక్స్ కల్వర్ట్లులు, 26 వెహికిల్, లైట్ వెహికిల్ అండర్ పాస్‌లు, 17 క్యాటిల్ అండర్‌పాస్‌లు, 1 వెహిక్యులర్ ఓవర్‌పాస్, 1 వైల్ యానిమల్ అండర్‌పాస్, 2 వైల్ యానిమల్ ఓవర్‌పాస్‌ల నిర్మాణం చేపట్టి పూర్తి చేసింది.
ముంబై టు -నాగ్‌పూర్ సూపర్ కమ్యూనికేషన్ ఎక్స్‌ప్రెస్ వేగా….
మహరాష్ట్రలోనే ఇతి అతి పొడవైన ప్రాజెక్టుగా రికార్డు సాధించింది. ఈ సమృద్ధి మహామార్గ్ మొత్తం పొడువు 701 కిలో మీటర్లు కాగా దీనికి హిందూ హృదయ సామ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహరాష్ట్ర అభివృద్ధి రహదారిగా నామకరణం చేశారు. ముంబై- టు పూణే తరువాత మహారాష్ట్రలో రెండో ప్రధాన ఎక్స్‌ప్రెస్ వే ఇదే. 14 జిల్లాలు, ఆరు తాలూకాలు, 392 గ్రామాల మీదుగా ఈ రహదారి నిర్మాణం జరిగింది. దీనిని ముంబై టు -నాగ్‌పూర్ సూపర్ కమ్యూనికేషన్ ఎక్స్‌ప్రెస్ వే అనికూడా పిలుస్తారు. మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (MSRDC) అమలు చేస్తున్న ప్రాజెక్ట్ ఇది కాగా, దేశంలోనే గంటకు 150 కి.మీల వేగంతో వాహనాలు ప్రయాణించేలా ఈ రోడ్డును నిర్మించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News