Thursday, September 18, 2025

ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. ‘మహావతార్ నరసింహా’ ఒటిటి రిలీజ్ ఎప్పుడంటే..

- Advertisement -
- Advertisement -

ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై.. సంచలనం సృష్టించింది ‘మహావతార్ నరసింహా’ (Mahavatar Narsimha). యానిమేషన్ సినిమా అయినప్పటకీ.. ఈ సినిమా అందరికి తెగ నచ్చేసింది. నరసింహా అవతారం కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా దాదాపు రూ.250 కోట్లు వసూలు చేసింది. థియేటర్‌లో అందరినీ అలరించిన ఈ సినిమా ఇప్పుడు బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. ‘మహావతార్ నరసింహా’ త్వరలోనే ఒటిటిలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు సహా పలు భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. ఈ నెల 19న మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ఆ ఒటిటి సంస్థ సోషల్‌మీడియా వేదికగా ప్రకటించింది. ఇక ఈ సినిమాకు అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించగా.. హోంబాలే ఫిలిమ్స్ సినిమాను నిర్మించారు.

Also Read : అందమైన ప్రేమ కథ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News