Tuesday, October 15, 2024

టిపిసిసి చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన ఎంఎల్ సి మహేష్ కుమార్ గౌడ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గాంధీభవన్ లో టిపిసిసి చీఫ్‌గా బొమ్మ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ బాధ్యతలు స్వీకరించారు. టిపిసిసి బాధ్యతలు మహేష్‌కుమార్‌ గౌడ్‌కు సిఎం రేవంత్ రెడ్డి అప్పగించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎంఎల్ఎలు, షబ్బీర్ అలీ, ఎఐసిసి ఇంఛార్జ్ దీపా దాస్ మున్షీ,  తదితర నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వెనుకబడిన తరగతులకు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ అవకాశం ఇస్తుందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో అత్యధిక స్థానాలు గెలిచి ఎఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తమ లక్ష్యమన్నారు. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణకు స్వాతంత్ర్య వచ్చిందన్నారు. నిజాం నుంచి విముక్తి కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని, బిజెపికి సంబంధం లేదన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది కూడా కాంగ్రెస్ అని ఉత్తమ్ కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News