Saturday, July 27, 2024

తెలంగాణలో ముస్లింలు అనాథలు అయ్యారు: మహమూద్ అలీ

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణలో ముస్లింలు అనాథలు అయ్యారని బిఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ఆవేదన వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ మాజీ ఎంఎల్‌ఎ షకీల్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం కక్ష కట్టి వేధిస్తోందని ఆరోపించారు. బిఆర్‌ఎస్ హయాంలో ఫ్రెండ్లీ పోలీసు ఉండగా… ఇప్పుడు ఎందుకు ఇలా మారిందని అందరూ అనుకుంటున్నారని అన్నారు. ప్రజల్లో మార్పు మొదలైందని, బిఆర్‌ఎస్ 12 ఎంపీ స్థానాలు గెలుచుకుంటుంది ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మాజీ సీఎం కెసిఆర్ ప్రభుత్వ హయాంలో మసీదులు కూలగొట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం అర్థరహితమని అన్నారు. సిఎఎకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో మాట్లాడేది బిఆర్‌ఎస్ మాత్రమే అని, ముస్లిం మైనార్టీలు బిఆర్‌ఎస్‌కు అండగా నిలవాలి కోరారు.

బిఆర్‌ఎస్ పార్టీ ఎప్పటికీ మతతత్వ బిజెపికి మద్దతు ఇవ్వదని స్పష్టం చేశారు. హైదరాబాద్ బిజెపి ఎంపీ అభ్యర్థిని మాధవీలత ఏం మాట్లాడుతారో ఆమెకే అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. లౌకికవాదాన్ని పాటించేది ఎప్పటికీ ప్రాంతీయ పార్టీలు మాత్రమేనని అన్నారు. లౌకిక వాదాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసింది కెసిఆర్ మాత్రమే అని పేర్కొన్నారు. మైనార్టీల కోసం కెసిఆర్ చాలా మంచి కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. ముస్లింల అభ్యున్నతికి విద్య చాలా ముఖ్యం అని, కెసిఆర్ 204 రెసిడెన్షియల్ స్కూల్స్ ముస్లిం మైనారిటీల కోసం స్థాపించాలని తెలిపారు. ప్రతి యేటా ఆ విద్యా సంస్థల్లో లక్షకు మంది విద్యార్థులు చదువుతున్నారని చెప్పారు. హైదరాబాద్‌లోనూ కరెంట్ కోతలు నడుస్తున్నాయి, ఉదయం తమ ఇంట్లో కూడా కరెంట్ పోయిందని చెప్పారు. ఎంపీ ఎన్నికలు అయ్యాక గృహజ్యోతి పథకాన్ని పూర్తిగా మరచిపోవాలని చెప్పారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఒక్క మహిళలు ఉచిత బస్సు తప్ప ఏమీ చేయలేదని మహమూద్ అలీ విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఎప్పుడూ అన్యాయమే చేస్తుందని, మైనార్టీలకు కూడా కాంగ్రెస్ అన్యాయం చేసిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ లౌకిక వాదం అని చెప్పుకుంటుంది కానీ, ఏమీ చేయదు అని వ్యాఖ్యానించారు. రాహుల్ తెలంగాణ మోడల్ అమలు చేస్తాం అంటే రేవంత్ గుజరాత్ మోడల్ అంటున్నారని, కెసిఆర్ తెలంగాణను అభివృద్ధి చేశారు కనుకే రాహుల్ తెలంగాణ మోడల్ అంటున్నారని చెప్పారు. కెసిఆర్ పదేళ్ల కష్టాన్ని కాంగ్రెస్ నేతలు ఈ నాలుగు నెలల్లో కుప్ప చేశారని విమర్శించారు. రేవంత్ రెడ్డి మైనార్టీలకు హామీలు ఇచ్చి ఏమీ చేయలేదని ఆరోపించారు. మైనార్టీలకు రేవంత్ రెడ్డి ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News