Saturday, May 4, 2024

మోకాళ్ళ యాత్ర చేసినా కెసిఆర్‌ను ప్రజలు నమ్మరు : ఎంపి లక్ష్మణ్

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలు డూప్ ఫైటింగ్ చేసుకుంటున్నాయని బిజెపి నేత రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. శనివారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ తలపెట్టిన బస్సు ‘యాత్ర పై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బస్సు యాత్ర కాదు కదా మోకాళ్ల యాత్ర చేసినా కెసిఆర్ ను ప్రజలు నమ్మె పరిస్థితితుల్లో లేరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎంఎల్‌ఎలను కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైటెన్షన్ వైర్ లా మారాల్సిన అవసరం ఏమొచ్చిందని లక్ష్మణ్ ప్రశ్నించారు. 100 రోజుల తమ పరిపాలనను రెఫరెండంగా చేసుకుని 14 ఎంపి స్థానాలు గెలుస్తామన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. కనుమరుగు అవుతున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనూ గెలిచే పరిస్థితి లేదన్నారు.

తెలంగాణలో బిజెపి 12 స్థానాల్లో గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బిజెపికి, మోడీకి రోజు రోజుకు ఆదరణ పెరుగుతోందన్నారు. అందువల్లే మోడీ చర్మిష్మా తగ్గించి చూపేందుకు బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు చీకటి ఒప్పందం చేసుకున్నాయని ధ్వజమెత్తారు. 20 మంది కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు తనతో టచ్ లో ఉన్నారని కెసిఆర్ చెప్పిన 24 గంటలు గడవక ముందే బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ ఒకరు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారని అన్నారు. లోకసభకు జరిగిన మొదటి ధపా ఎన్నికల్లో బిజెపి 50 శాతం కంటే ఎక్కువ సీట్లు గెలుస్తుందనే నమ్మకం ఉందన్నారు. కాంగ్రెస్, ఎంఐఎం, బిఆర్‌ఎస్, కమ్యూనిస్టులు ఏకమై బిజెపిని ఓడించలేరన్నారు. వికసిత తెలంగాణ పేరుతో ఒక సంకల్ప పత్రం త్వరలోనే విడుదల చేయనున్నట్లు లక్ష్మణ్ ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News