Sunday, October 6, 2024

మైసమ్మ చెరువునూ మింగేసిన వాసవి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కెపిహెచ్‌బి: ఒక నాడు జనాలకు సాగు, తాగు నీరు అందించిన అ తిపెద్ద చెరువు. గత రెండు దశాబ్ధాలుగా అ క్రమార్కులు చెరబట్టడంతో అంతకంతకు కనుమరుగయ్యే దశకు చేరుకుంటుంది. శిఖం, ఎఫ్‌టిఎల్‌తో కలిసి 149 ఎకరాల వి స్తీర్ణంలో ఉన్న చెరువు ఇప్పుడు చుట్టూ వెలిసిన, వెలుస్తున్న నిర్మాణాలతో సగానికి స గం కూడా కనిపించని పరిస్థితి. మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లి మండల ప రధిలోని మూసాపేట గ్రామ శివారులోని మైసమ్మ చెరువు దీనగాధ. మూసాపేట గ్రామ శివారు పరిధిలోని 893లో 84.2 ఎకరాల చెరువు శిఖం (పభుత్వం) కాగా సర్వేనెంబర్లు892,894నుంచి898, 901, 902,905, 906, 907 వరకు, 40 నుంచి 49 వరకు , 56, 58 నుంచి 74,79 వర కు,99 నుంచి107ల వరకు కలిసి మొత్తం 149 ఎకరాల్లో చెరువు విస్తరించి ఉన్నద ని నాటి ఇరిగేషన్ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. చెరువు పూర్తిస్థాయిలో నిండనప్పుడు ప్రైవేటు పట్టా భూమి కలిగిన రై తు లు నాడు వ్యవసాయం చేసుకునే వారని స్థానికులు చెబుతున్నారు. చెరువు పూర్తిస్థాయిలో నిండితే కాముని చెరువు కట్ట వ రకు నీరు నిలిచి ఉండేదని, వర్షాకాలంలో పంటలు వేయలేక పోతుండేవారమని, వే సవి సమయంలోనే పంట పండించుకునే వారమని నాటి మూసాపేట రైతుల మాట.

చెరువును చెరబట్టిన అక్రమార్కులు
ఈ ప్రాంతంలో అత్యంత విస్తీర్ణం కలిగిన అ తిపెద్ద చెరువుగా గుర్తింపు పొందిన మైస మ్మ చెరువు నగరానికి కూతవేటు దూరం లో ఉంటుంది. భూముల విలువలు బంగా రం కంటే ప్రియంగా మారడంతో కబ్జాదారులు, అక్రమార్కుల దృష్టి ఈ చెరువుపై ప డింది. పేదలముసుగులో అక్రమార్కులు మట్టితో నింపడం, యాబై, వంద గజాలలో బీస్మెంట్లు నిర్మించి అదే పేదలకు విక్రయించి సొమ్ము చేసుకోవడం నిరంతరం జరుగుతూనే ఉంది. రాజకీయ నాయకుల అండదండలతో చెరువు క బ్జాల వ్యవహారం గత రెండు దశాబ్ధాలుగా మూడుపువ్వు లు ఆరుకాయలగా కొనసాగతుంది. ఈ క్రమంలోనే రాజీవ్‌గాంధీనగర్, సప్ధర్‌నగర్ లాంటి బస్తీలు ఏర్పడ్డా యి. భారీ వర్షాలలో ఈ బస్తీలన్నీ జలమయం కావడం, అధికారులు తాత్కాలిక చర్యలు గత రెండు దశాబ్దాలు గా అధికారుల రాజకీయ, అధికారుల సాక్షిగా చెరువు మనగడను ప్రశ్నార్ధకంగా మార్చివేశారు. ఈ బస్తీల్లో స గానికిపై గా నివాసాలు ఎఫ్‌టిఎల్ పరిధిలోనే ఉన్నాయని ఇరిగేషన్ ఏఈ లక్ష్మీనారాయణ తెలిపారు.

చెరువుపై కన్నేసిన బడా నిర్మాణ సంస్థలు
చెరువు ఎఫ్‌టిఎల్ పరిలో ఒక వైపు బస్తీలు ఏర్పడి వేలాది మంది పేద, మధ్య తరగతి ప్రజలు నివాసం ఉంటున్నా రు. హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉన్న ఈ చెరువుపై బడా నిర్మాణ సంస్థల దృష్టి పడింది. ప్రైవేటు పట్టాదారుల వద్ద బజాప్తా కొనుగోలు చేశామని చెప్పుకుం టూ చెరువు ఎఫ్‌టిఎల్ పరిధిలో పాగా వేస్తున్నాయి. చె రువు స్థలాన్ని ఆక్రమించినట్లు బయటకు తెలియకుండా దత్తత పేరుతో ఓ బడా నిర్మాణ సంస్థ డ్రామాకు తెరలేపింది. చెరువును తామే ఉద్దరిస్తున్నట్లు చెరువులో డ్రైనే జీ నీరు కలవకుండా చుట్టూ కట్ట నిర్మాణం చేపడుతున్న ట్లు కలరింగిచ్చే ప్రయత్నం చేస్తొంది. కొంతమంది నా యకులు, అధికారుల అండదండలతో బడా నిర్మాణ సం స్థలు చెరువులను మింగేసే కుట్రలో భాగంగా ఆ సంస్థ సుమారు రూ.5 కోట్ల వ్యయంతో దీనికి శ్రీకారం చుట్టిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాముని చెరువుకట్ట కింద ఉన్న వ్యవసాయ భూములను దశాబ్దం క్రితం కొ నుగోలు చేసిన రియల్‌ఎస్టేట్ వ్యాపారి తాజాగా వాసవి అనే బడా నిర్మాణ సంస్థకు విక్రయించాడు. ప్రస్తుతం ఆ సంస్థ ఆకాశ హార్మాలను తలపించే నిర్మాణాలకు శ్రీకా రం చుట్టింది.

సదరు సంస్థ చేపట్టే నిర్మాణాలు సగానికి పైగా మైసమ్మ చెరువు ఎఫ్‌టి ఎల్ పరిధిలోనివేనని జగమెరిగిన సత్యం. భవిష్యత్‌లో మైసమ్మ చెరువు నిం డితే నీరు తమ నిర్మాణాల్లోకి రాకుండా ఉండేందుకు మైసమ్మ చెరువును దత్తత పేరుతో తీసుకుని చెరువు చుట్టూ కట్ట నిర్మాణం చేపడుతున్నారని స్థానికులకు అర్ధమైంది. దీంతో స్థానికులు వివిధ సంస్థలు, పార్టీల నాయకులు సంస్థ చేపట్టే నిర్మాణాలకు ఎలా అనుమతులు ఇ చ్చారని నిలదీస్తున్నారు. చెరువు చుట్టూ దత్తత పేరుతో నిర్మాణ సంస్థ చేపట్టిన కట్ట నిర్మాణంతో నాటి అతిపెద్ద చెరువు నేడు మురుగునీటి గుంతను తలపిస్తుంది. ఎక్కడికక్కడ వర్షం నీరు చెరువులోకి చేరకుండా చేస్తుందని ఆరోపిస్తున్నారు.ఆక్రమణలను మినహాయించి కట్ట నిర్మాణం చేపట్టడంతో మైసమ్మచెరువు సగానికిపైగా కు చించుకపోయి మురుగునీటికి నిలయంగా మారింది. ఇంకోవైపు ఇదే అదనుగా హానర్ అనే సంస్థ చెరువు శి ఖం,ఎఫ్‌టిఎల్ పరిధిలోని 5 ఎకరాల్లో తమ సంస్థ చే పట్టే నిర్మాణాల సెల్లార్ల నుంచి తీసిన మట్టితో పూడ్చివేసింది. దీంతో తమ సంస్థకు సంబంధం లేదని ఆ సంస్థ చెప్పి తప్పించుకుని మట్టిపోయించే పనిని గుత్తకు తీసుకున్న వ్యక్తులపై కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు కూ డా నమోదైంది.

ఇంకో వైపు సైబర్‌సిటీ నిర్మాణ సంస్థ చేపడుతున్న కొన్ని నిర్మాణాలు కూడా మైసమ్మ చెరువు ఎఫ్‌టిఎల్ పరిధిలోనే ఉన్నాయని పేర్కొంటూ ఇటీవల స్థానిక ప్రజా ప్రతినిధిధులు హైడ్రా, ఇరిగేషన్‌అధికారులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. కూకట్‌పల్లి నియోజకవర్గం పరిధిలోని మూసాపేట మైసమ్మ చెరువు ఆక్రమణలపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇప్పటికే రెండుసార్లు పరిశీలించారు. చెరువు శిఖం, ఎఫ్‌టి ఎల్‌పరిధి ఎంత అనేదానిపై పూర్వపు రికార్డులను , సర్వే నెంబర్ల వారీగా భూమి వివరాలను అందజేయాలని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మైసమ్మ చెరువు శిఖం, ఎఫ్‌టిఎల్ పరిధిలోని వెలిసిన రాజీవ్‌గాంధీనగర్, సప్ధర్‌నగర్ బస్తీల్లోని చాలా ఇళ్ళకు ఇప్పటికే అధికారులు నోటీసులు జారీ చేశారు. కూకట్‌పల్లి-, హైటెక్‌సిటీ రహదారి వైపు ఉన్న చెరువు ఎఫ్‌టిఎల్ పరిధిలో వాసవి నిర్మాణ సంస్థ వాసవీ సరోవర్ లేక్ వ్యూపేరుతో చేపడుతున్న నిర్మాణాలను, ఇతర నిర్మాణా సంస్థలు చేపడుతున్న నిర్మాణాలు చెరువు ఎఫ్‌టిఎల్ పరిధిని ఎంతమేరకు అతిక్రమించాయో లెక్క తేల్చే పనిలో హైడ్రా తలమునకలైంది. ఎఫ్‌టిఎల్ ఆక్రమణలపై బడా నిర్మాణ సంస్థలు ఇచ్చే వివరణలతో సం తృప్తి చెందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ రెండు సార్లు చెరువును సందర్శించారని తెలిసింది. త్వరలో ఎఫ్‌టిఎల్ పరిధిని నిర్ధారించి అందులో వెలిసిన బడా నిర్మాణ సంస్థల నిర్మాణాలపై కొరఢా ఝుళిపించే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News