Saturday, December 14, 2024

ప్రణాళిక లేకుండా హామీలివ్వొద్దు: ఖర్గే

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పథకాలు, హామీల గ్యారెంటీలపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బడ్జెట్‌ను పూర్తిగా అంచనా వేయకుండా హామీలను ప్రకటించవద్దని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్‌పై ప్రణాళిక లేకుండా గ్యారెంటీలు ఇస్తే అది ఆర్థిక సవాళ్లకు దారి తీస్తుందని హెచ్చరించారు. ఇది భవిష్యత్తు తరాలకు ప్రతికూలంగా మారుతుందన్నారు. అన్ని కోణాల్లోనూ పరిశీలించి హామీలు ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా, హామీలు ఇచ్చేటప్పుడు ఆర్థిక ప్రణాళికా బాధ్యత ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. హామీలను అమలు చేయలేని పక్షంలో పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటుందని హెచ్చరించారు. ప్రణాళిక లేకుండా హామీలు ఇస్తే ఆ తర్వాత వివిధ వర్గాలపై భారం పడుతుందన్నారు. త్వరలో జరగబోయే మహారాష్ట్ర ఎన్నికల్లో ఐదు, ఆరు, పది, ఇరవై గ్యారంటీలు అంటూ ఏమీ ప్రకటించడం లేదన్నారు. బడ్జెట్ ఆధారంగా హామీలు ప్రకటించాలన్నారు. లేదంటే రాష్ట్రం దివాలా పరిస్థితికి చేరుతుందన్నారు. రోడ్లు వేసేందుకు కూడా డబ్బు లేకపోతే ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News