Thursday, November 30, 2023

మైనంపల్లి రాజీనామా..అల్వాల్లో రాజుకున్న చిచ్చు

- Advertisement -
- Advertisement -

అల్వాల్ : మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బిఆర్‌ఎస్‌కు రాజీనామాతో ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా అల్వాల్‌లో చిచ్చు రాజుకుంది. రానున్న ఎన్నికల్లో తనతో పాటు తన కుమారుడికి సైతం పార్టీ టికెట్ కేలాయించాలంటూడిమాండ్ చేయడంతో పాటు ఆ పార్టీ కీలక నేతపై హనుంతరావు అనుచిత వ్యాఖ్యలు చేసిన నేథ్యంలో ఆయనపై సస్పెండ్ వేటు తప్పదని భావిస్తున్న తరుణంలో శుక్రవారం హనుమంతరావు స్వయంగా పార్టీని వీడుతున్నట్లు ప్రకటించడంతో బిఆర్‌ఎస్‌లు శ్రేణులో ఒక్కసారిగా అలజడి ఏర్పడింది. అయితే ఇప్పటి వరకు హనుంతరావు ఏ పార్టీ నుండి పోటీ చేస్తారో అధికారికంగా ప్రకటించనప్పటికీ కాంగ్రెస్ నుండి బరీలో దిగనున్నరంటూ అయన అనుచరులు చెప్పకనే చెప్తున్నారు.

దీంతో కాంగ్రెస్ పార్టీలో సైతం కలకలం రేగుతోంది. ఇప్పటి వరకు కాంగ్రెస్‌కు వెన్నంటి ఇన్నేళ్లుగా పనిచేస్తున్న మేడ్చల్ మల్కాజ్‌గిరి డిసిసి అధ్యక్షులు నందికంటి శ్రీధర్ కు ఇది తీరని అన్యాయంగా కార్యకర్తలు అభిమానులు భావిస్తున్నారు. పార్టీ అధిష్టానం ఆదేశాలు పాటించక తప్పదు కాబట్టి నందికంటి నిర్ణయం ఎదురుచూస్తున్నారు. మరోవైపు నందికంటి శ్రీధర్ బిఆర్‌ఎస్ లోకి చేరనున్నారని ప్రచారం జోరందుకోవడంలోఈ వార్తను ఆయన ఖండించినప్పటికీ అటు బిఆర్‌ఎస్ శ్రేణులను కలిచివేస్తోంది. కాంగ్రెస్‌లోకి మైనంపల్లి, బిఆర్‌ఎస్‌లోకి నందికంటి శ్రీధర్ అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి.

ఉద్యమకారులకే ప్రాధాన్యత ఇవ్వాలి ః బిఆర్‌ఎస్ శ్రేణులు
బిఆర్‌ఎస్ పార్టీలో తొలినాళ్ల నుండి పనిచేసిన ఉద్యమ నాయకులను కాదని అన్యులకు ఈ స్థానాన్ని కేటాయిస్తే సహించేదిలేదని స్థానికులకు, ఉద్యమ నాయకులకు మాత్రమే సీటు కేటాయించాలని బిఆర్‌ఎస్ శ్రేణుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. ముఖ్యంగా బద్దం పరుశురాం రెడ్డి, గొట్టిముక్కుల జ్యోతి శ్రీనివాస్ గౌడ్, ఢిల్లీ పరమేశ్ తమ అభిప్రాయాలను మీడియా ముందు వ్యక్తపరిచారు.గతంలో ఇండిపెండెంట్ కార్పొరేటర్ గా గెలిచిన టిఆర్‌ఎస్ నాయకురాలు గొట్టిముక్కుల జ్యోతి శ్రీనివాస్ గౌడ్ జిహెచ్‌ఎంసి కో ఆప్షన్ సభ్యురాలుగా సైతం పని చేశారు. ఆమె గతంలోనూ కార్మికుల పట్ల యూనియన్ కార్యకలాపాల ద్వారా తమకంటూ ప్రత్యేక ముద్రను వేసుకున్నారు. ఈ టికెట్ కచ్చితంగా తనకే ఇవ్వాలని కోరుతున్నారు. 2011 నుండి కేసీఆర్ వెన్నంటి ఉండి దాదాపు అన్ని పిలుపులలో పాల్గొని ఢిల్లీలో సైతం నిరాహార దీక్షలు చేసి ఢిల్లీ పరమేష్ గా పేరొందిన పరమేష్ బరిలో నేను సైతం అంటున్నారు.దళిత ఉద్యమకారునిగా గుర్తించి తనకు టికెట్ కేటాయించడం ద్వారా జెండా మోసిన వారిని ప్రభుత్వం గుర్తిస్తుందని,

డబ్బు ప్రధానం కాదని నిరూపించాలని కేసీఆర్ ను కోరుతున్నారు. మరోవైపు మల్కాజ్‌గిరి అంటే కనకారెడ్డి కనకారెడ్డి అంటే మల్కాజ్‌గిరి అన్న చందంగా ప్రజాధరణ పొందిన నేతగా నేటికీ పేరున్న దివంగత కనకారెడ్డి కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ టికెట్ కేటాయించాల్సిన సమయం వచ్చిందని ఆయన వర్గీయులు తెలుపుతున్నారు. ఆ కుటుంబానికి ఇప్పటికే 4 ఎన్నికలలో పాల్గొన్న అనుభవం ఉంది. కనకారెడ్డి ఒకసారి ఓడి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందగా. రెండుసార్లు తన కోడలు చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి కార్పొరేటర్ గా గెలుపొంది అనునిత్యం ప్రజల మధ్య ఉంటుంది. ప్రత్యక్ష రాజకీయాల కంటే ముందు నుండి కనకారెడ్డి కుటుంబం అన్ని వర్గాల ప్రజల మన్ననలు అందుకుందంటున్నారు. గతంలో ఎమ్మెల్యేగా గ్రేటర్ లో టిఆర్‌ఎస్ పార్టీకి గెలుపునందించి తన సత్తా చాటిన కనకారెడ్డి అనారోగ్యం కారణంగా సీటును మైనంపల్లికి త్యాగం చేయాల్సి వచ్చిందని, ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకూడదని సామాజిక వర్గీయులతో పాటు ఆయన మద్దతుదారులు పట్టుదలతో ఉన్నారు.

మర్రి రాజశేఖర్‌రెడ్డికే టికెట్?
ఇదేక్రమంలో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజవకవర్గం బిఆర్‌ఎస్ పార్టీ ఇంఛార్జీ మర్రి రాజశేఖర్‌రెడ్డికి టికెట్ దాదాపుగా ఖరారు అయినట్లుగా వార్తలు వెలువడుతుండడంతో ఈ నియోజకవర్గంలోని బిఆర్‌ఎస్ నేతలో అలజడి రేగుతోంది.స్థానిక నేతలను కాదని స్థానికేతరులకు టికెట్ కేటాయించరనే నమ్మకం ఉందంటూనే ఒకే కుటుంబంలో మామ మల్లారెడ్డి, అల్లుడు రాజశేఖర్‌రెడ్డికి ఎలా కేటాయిస్తారంటూ లోలోపల మధనపడుతున్నారు. ఇదే జరిగితే బిఆర్‌ఎస్ లో తిరిగినా ఓటుమాత్రం మైనంపల్లికే వేస్తామంటూ ‘మర్రి కి నై శాంతి కి సై‘ స్థానిక ప్రజలు బిఆర్‌ఎస్ కార్యకర్తలు తెలుపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News