Monday, May 6, 2024

ఓబిసిల ఉద్యమానికి ఎంఎల్‌సి కవిత మద్దతు

- Advertisement -
- Advertisement -

కృతజ్ఞతలు తెలిపిన కిశోర్ గౌడ్

మన తెలంగాణ / హైదరాబాద్ : చట్టసభలలో బిసిలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, మహిళా బిల్లులో బిసి మహిళలకు సబ్ కోటా కల్పించాలని బిసి సంఘాలు చేసే పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ప్రకటించిన ఎంఎల్‌సి కవితకు రాష్ట్ర బిసి కమిషన్ సభ్యుడు కిశోర్ గౌడ్ కృతజ్ఞతు తెలిపారు. మద్దతు ప్రకటించగాకుండా బిసి సంఘాలు చేసే ఉద్యమంలో కలిసి నడుస్తామని చెప్పిన భారత జాగృతి అధ్యక్షురాలు, ఎంఎల్‌సి కల్వకుంట్ల కవితకు దేశ వ్యాప్తంగా ఉన్న ఓబిసి ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని కిశోర్ గౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

జాగృతి సంస్థను స్థాపించినప్పటి నుండి కవిత చేసే ప్రతి పోరాటం విజయం సాధించిందని అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు, మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ లో పెట్టాలని ఉద్యమం, ఏ కార్యక్రమం అయినా విజయం సాధించేవరకు పోరాటం చేయడం కవిత పోరాట పటిమకు నిదర్శమని ఆయనన్నారు. చట్టసభల్లో ఓబిసి బిల్లు పెట్టాలని, మహిళా బిల్లులో బిసి మహిళలకు సబ్ కోట కల్పించాలని చేసే ఉద్యమానికి కవిత మద్దతు తెలపడం చాలా సంతోషకరమైన విషయమని, ఈ ఉద్యమం కూడా విజయం సాధిస్తుందని ఆయనన్నారు. పార్లమెంట్‌లో బిసి బిల్లు పెట్టే వరకు అదే ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తారని విజయం సాధిస్తారన్న ఆశాభావాన్ని కిషోర్ గౌడ్ వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News