Monday, April 29, 2024

ఈ యుద్ధంలో మొయిత్రా విజయం సాధిస్తారు: మమత

- Advertisement -
- Advertisement -

తమ పార్టీ ఎంపి మహువా మొయిత్రాను లోక్‌సభనుంచి బహిష్కరించడాన్ని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు.ఈ చర్యను దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు జరిగిన ద్రోహంగా అభివర్ణించారు.‘ ఈ ఘటన పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి సిగ్గుచోటు. మహువా మొయిత్రా బహిష్కరణను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ సమయంలో ఆమెకు పార్టీ అండగా ఉంటుంది. ఎన్నికల్లో మమ్మల్ని ఓడించలేక బిజెపి ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతోంది. ఇలా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ‘

ఇది విచారకరమైన రోజు. ప్రజాస్వామ్యానికి తీరని ద్రోహం’ అని మమత విలేఖరులతో అన్నారు.‘ లోక్‌సభలో చర్చ సందర్భంగా మహువాకు కనీసం తన వాదనను వినిపించుకునేందుకు అవకాశం ఇవ్వకపోవడం చాలా అన్యాయం. మెజారిటీ ఉంది కనకు తాము ఏమైనా చేయవచ్చని ఆ పార్టీ భావిస్తోంది. కానీ వారు అధికారం దిగే రోజు వస్తుంది.ఆ విషయం వారు గుర్తు పెట్టుకోవాలి’ అని కేంద్రాన్ని దుయ్యబట్టారు. ఈ యుద్ధంతో మహువా తప్పకుండా విజయం సాధిస్తారని, వచ్చే ఎన్నికల్లో మరింత మెజారిటీతో మళ్లీ పార్లమెంటులో అడుగుపెడతారని మమతా బెనర్జీ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News