Thursday, February 29, 2024

నేవీలో 10,896 మంది సిబ్బంది కొరత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారతీయ నౌకాదళం ప్రస్తుతం 1,777 మంది ఆఫీసర్లతోసహా 10,896 మంది సిబ్బంది కొరత ఎదుర్కొంటోందని రక్షణ శాఖ శుక్రవారం పార్లమెంట్‌లో తెలియచేసింది. ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీ నాటికి నేవీలో 9,119 సెయిలర్స్ పోస్టులు, 1,777 ఆఫీసర్ క్యాంకు పోస్టులు ఖాళీలు ఉన్నాయని రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ ఒక ప్రశ్నకు జవాబుగా లోక్‌సభలో తెలిపారు. భారతీయ నౌకాదళంలో మొత్తం 11,979 ఆఫీసర్ పోస్టులు, 76,649 సెయిలర్ పోస్టులు ఉన్నాయని ఆయన వివరించారు. 2021లో 323 మంది ఆఫీర్లను నియమించగా 2022లో 386 మందినియామకం జరిగిందని ఆయన తెలిపారు. 2021లో 5,547 సెయిలర్ల నియామకం జరుగగా 2022లో 5,171 నియామకం జరిగిందని మంత్రి చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News