Saturday, April 20, 2024

కాంగ్రెస్‌కు మమత మద్దతు భేష్: చిదంబరం

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా : కాంగ్రెస్‌కు మద్దతు విషయంలో టిఎంసి అధినేత్రి మమత బెనర్జీ చేసిన ప్రకటనను కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం స్వాగతించారు. కాంగ్రెస్‌కు ఇతర ప్రతిపక్షాల నుంచి మద్దతు ఇప్పటి తక్షణావసరం అని, అయితే ఇది పూర్తిగా ఇచ్చిపుచ్చుకునే విధంగా ఉండాలని ఇటీవల మమత బెనర్జీ తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నచోట్ల కాంగ్రెస్ మద్దతు, కాంగ్రెస్ పటిష్టత గల రాష్ట్రాలలో ఆ పార్టీకి ఇతర ప్రతిపక్షాల అండదండలు ఉండాలని, దీని వల్ల ప్రతిపక్ష పార్టీల ఓట్లు చీలకుండా ఉంటాయని ఇటీవల ఓ ఇంటర్వూలో మమత తెలిపారు. ఇప్పుడు ఈ దిశలో మమత తగురీతిలో సంప్రదింపులు ఆరంభించాలని , దీని వల్ల సత్ఫలితాలు ఉంటాయని చిదంబరం తెలిపారు.

బిజెపిని లోక్‌సభ ఎన్నికలలో ఓడించే ఏకైక లక్షంతో పార్టీలన్ని ముందుకు వస్తే, కాంగ్రెస్‌ను జాతీయ స్థాయిలో ప్రధాన ప్రత్యామ్నాయ శక్తిగా తెలియచేయడం జరిగితే పరిస్థితి మెరుగుపడుతుందని తెలిపిన చిదంబరం ఇక మమత ఈ దిశలో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రాలలో పటిష్టంగా ఉండే బిజెపి వ్యతిరేక పార్టీలు ఉన్నాయి. ఆయా పార్టీలను కాంగ్రెస్ మిత్రపక్షంగా భావించాల్సి ఉంటుంది. దీని వల్ల ఇతర చోట్ల కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందనే మమత అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నట్లు చిదంబరం తెలిపారు. బిజెపియేతర పార్టీల మధ్య ఐక్యత ఇప్పుడు వర్క్ ఇన్ ప్రోగ్రెస్‌గా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిపక్షపార్టీలు చేరువ అవుతున్నాయని, అయితే అధిగమించాల్సిన దూరం ఇంకా ఉందని తెలిపారు. వచ్చే నెల 12న పాట్నాలో ప్రతిపక్షాల సదస్సు జరుగుతున్న దశలో చిదంబరం ఈ దిశలో మాట్లాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News