Saturday, April 27, 2024

ఈశాన్యంలో తొలి వందేభారత్..

- Advertisement -
- Advertisement -

గువహతి : ప్రధాని నరేంద్ర మోడీ మరో వందేభారత్ రైలుకు పచ్చజెండా చూపి ప్రారంభించారు. సోమవారం ఈశాన్యప్రాంతపు తొట్టతొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రధాని చేతుల మీదుగా సోమవారం పట్టాలకెక్కింది. అసోంలోని గువహతి నుంచి పశ్చిమబెంగాల్‌లోని న్యూ జల్పాయ్‌గురి మధ్య నడిచే ఈ రైలును ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు. కాగా గువహతి స్టేషన్‌లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, అసోం గవర్నర్ గులాబ్ చంద్ కటారియా,

రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈశాన్య ప్రాంతానికి తొలి వందేభారత్ వల్ల ఈ ప్రాంతంలో పర్యాటకం, విద్యా, ఉపాధి , వ్యాపార వాణిజ్య అవకాశాలు మరింతగా పెరుగుతాయని ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ తెలిపారు. తమ ప్రభుత్వం తొమ్మిదేళ్లుగా ప్రగతిపథంలో సాగిస్తున్న ప్రయాణానికి ఇటువంటి వందేభారత్ రైళ్లుతార్కాణం అని ప్రధాని తమ సందేశంలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News