Tuesday, April 16, 2024

ఢిల్లీలో బాలిక కిరాతక హత్య

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం రాత్రి అంతా చూస్తూ ఉండగానే ఓ 16 ఏండ్ల బాలికను ఓ వ్యక్తి అతి కిరాతకంగా హత్య చేశాడు. దాడికి దిగిన యువకుడు కత్తితో ఆమెను 21 సార్లు పొడిచి తరువాత కిందికి తోసేసి, రాయితో నెత్తిపై కొట్టాడు. స్థానిక రోహిణీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అక్కడి సిసిటీవీ కెమెరాల్లో ఈ దారుణ దృశ్యాలు చోటు చేసుకున్నాయి. హత్యకు పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో పట్టుకున్నారు. ఈ 20 ఏండ్ల యువకుడిని విచారిస్తున్నారు. బాలికపై ఈ వ్యక్తి పైశాచికంగా దాడికి దిగుతూ ఉన్న అక్కడి నుంచి వెళ్లుతున్న వారు పట్టించుకోలేదు. ఎవరికి వారుగా వెళ్లారు.

కత్తిపోట్లకు తరువాత పలు మార్లు బండరాయితో బాదడంతో ఈ బాలిక నెత్తుటి మడుగులో పడి చనిపోయింది. దాడికి పాల్పడ్డ వ్యక్తిని సాహిల్ గా గుర్తించారు. బులంద్‌షహర్‌లో ఈ యువకుడు ఫ్రిజ్‌ల రిపేర్ పనిలో ఉన్నట్లు తెలిసింది. తన కూతురు పుట్టినరోజు కావడంతో బట్టలు కొనుక్కోవడానికి వెళ్లి అక్కడి నుంచి ఓ స్నేహితురాలిని కలిసేందుకు వెళ్లిందని ఈ విధంగా బలి అయిందని తండ్రి కన్నీటి పర్యంతం అయ్యారు. జరిగిన దారుణంపై ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. లెఫ్టినెంట్ గవర్నర్ శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యతల్లో ఉండి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

ఇటువంటివి జరగకుండా ఇకనైనా ఎల్‌జి చర్యలు తీసుకోవల్సి ఉందన్నారు. నేరస్తులు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. పోలీసులంటే భయం లేకుండా పోయిందని, శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత ఎల్‌జిదే. ఏది ఏమైనా, ఎవరిది బాధ్యత అయినా ఢిల్లీ ప్రజల భద్రత కీలకమని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News