Thursday, May 2, 2024

కులం కాని వ్యక్తితో సంబంధం పెట్టుకుందని సోదరి తలనరికి…

- Advertisement -
- Advertisement -

బారాబంకీ: ఉత్తరప్రదేశ్‌లో మరో ఘోరం జరిగింది. కులం కాని వ్యక్తితో సంబంధం పెట్టుకుని లేచిపోయిందనే కోపంతో ఓ యువకుడు తన సోదరి తల తెగనరికి.. ఆ తలను చేతిలో పట్టుకుని తిరిగాడు. యూపీలోని బారాబంకీ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బారాబంకీ జిల్లాకు చెందిన ఓ యువతి.. తన సామాజిక వర్గం కాని వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుంది.

ఈ విషయంలో గొడవలు జరగడంతో అతనితో కలిసి లేచిపోయింది. దాంతో ఆగ్రహించిన ఆమె సోదరుడు రియాజ్ (24) ఆ యువతిని వెతికిపట్టుకుని దారుణంగా హత్యచేశాడు. మొండెం నుంచి తలను వేరు చేయగడమేగాక.. ఆ తలను చేతిలో పట్టుకుని వీధుల్లో తిరిగాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు రియాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కులంకానీ వ్యక్తితో లేచిపోయినందుకే తాను ఈ ఘాతుకానికి ఒడిగట్టానని పోలీసుల ప్రాథమిక విచారణలో రియాజ్ తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News