Saturday, November 2, 2024

కాటేసిన స్నేహం… ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి హత్య

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ లో దారుణం జరిగింది. ఆస్తికోసం స్నేహితుడి కుటుంబాన్ని అంతం చేశాడొక దుర్మార్గుడు. మాక్లూరుకు చెందిన ప్రశాంత్ అనే వ్యక్తి తన స్నేహితుడు ప్రసాద్ తో సహా, అతని కుటుంబంలోని ఆరుగురు వ్యక్తుల్ని హత్య చేశాడు.

నిందితుడు ప్రశాంత్, హతుడు ప్రసాద్ ల స్వస్థలం మాక్లూర్. ప్రసాద్ చాలాకాలం క్రితమే మాచారెడ్డికి వెళ్లి స్థిరపడ్డాడు. ప్రశాంత్, ప్రసాద్ ల మధ్య చిరకాల స్నేహం ఉంది. ప్రసాద్ ఇంటిపై కన్నేసిన ప్రశాంత్, ఇంటిపై లోన్ ఇప్పిస్తానంటూ ఆ ఇంటిని తన పేరిట రాయించుకున్నాడు. లోన్ ఇప్పించకపోగా, ఆ ఇల్లు తనదేనని ప్రశాంత్ వాదించడంతో నివ్వెరపోయిన ప్రసాద్ తన ఇంటికోసం ప్రశాంత్ తో ఘర్షణ పడేవాడు. దాంతో ప్రసాద్ ను శాశ్వతంగా తొలగించుకోవాలని ప్లాన్ చేసిన  ప్రశాంత్ మాయమాటలు చెప్పి ప్రసాద్ ను కామారెడ్డి వద్ద అటవీప్రాంతంలో మట్టుపెట్టాడు.

ఆ తర్వాత అతని భార్యను మభ్యపెట్టి తీసుకువెళ్లి బాసర వద్ద గోదావరిలోకి తోసేశాడు. వారి ఇద్దరు పిల్లలను చంపి, కాలువలోకి తోసేశాడు. అంతటితో ఆగక, ప్రసాద్ ఇద్దరు చెల్లెళ్లను కూడా ఇదే తరహాలో చంపేశాడు. సదాశివనగర్ లో ఒక మహిళ మృతదేహం లభించడంతో పోలీసులు తీగె లాగితే డొంకంతా కదిలింది. బాల్కొండ సోన్ బ్రిడ్జి సమీపంలో ఇద్దరు పిల్లల మృతదేహాలు, మాచారెడ్డిలో మరొక మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఈ హత్యలన్నింటినీ 15 రోజుల వ్యవధిలోనే చేసినట్లు తెలుస్తోంది. ఈ హత్యాకాండలో ప్రశాంత్ కు మరో ముగ్గురు సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News