Saturday, December 3, 2022

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

- Advertisement -

మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ ప్రతినిధి: నాగర్‌కర్నూల్ పట్టణానికి చెందిన తాటాకుల శేఖర్(35) అనే వ్యక్తి కుటుంబ కలహాలతో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు నాగర్‌కర్నూల్ ఎస్సై వీణా కుమారి తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భార్యతో తరచుగా గొడవపడే శేఖర్ బుధవారం భార్యతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలిపారు. అదే రోజు రాత్రి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉండగా నల్లవెల్లి రోడ్డున గల వ్యవసాయ పొలంలో పూర్తిగా కాలి ఉన్న మృతదేహాన్ని స్థానికులు గురువారం ఉదయం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కిరోసిన్ పోసుకుని మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు ఉంటాడని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇదిలా ఉండగా భార్య భాగ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వీణా కుమారి తెలిపారు. మృతుడికి పాప ఉన్నట్లు స్థానికులు తెలిపారు.

Related Articles

- Advertisement -

Latest Articles