Thursday, February 2, 2023

రామగుండంలో ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య..

- Advertisement -

మనతెలంగాణ/రామగుండం: రామగుండం పట్టణంలోని టెంపుల్ రోడ్డుకు చెందిన ఆవు గడ్డ ఫణీంద్ర కుమార్ (29) అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. లారీ మెకానిక్‌గా జీవనం కొనసాగిస్తున్న ఫణీంద్ర కుమార్‌కు గత కొంత కాలంగా కాళ్లు, చేతులు, తిమ్మిర్ల వ్యాధితో బాధ పడుతుండగా మానసికంగా కుంగిపోయాడు.

ఈ క్రమంలో శనివారం తిమ్మిర్ల తీవ్రత ఎక్కువ కావడంతో మానసికంగా మరింత కుంగిపోయి ఇంట్లో ఎవరూ లేని సమయంలో తనన బెడ్ రూమ్‌లోని ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.మృతుని తల్లి సత్యవతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామగుండం ఎస్‌ఐ బి.శరణ్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles