Monday, April 29, 2024

మేనకా గాంధీపై ఇస్కాన్ రూ.100 కోట్ల పరువునష్టం దావా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తన గోశాలలోని వట్టిపోయిన ఆవులను వధశాలలకు అమ్మివేస్తున్న అత్యంత మోసకారి ఇస్కాన్ అంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించిన బిజెపి ఎంపి, మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీపై ఇస్కాన్ రూ. 100 కోట్ల పరువునష్టం దావా వేసింది.

ఇస్కాన్‌పై అసత్య, నిరారార ఆరోపణలు చేసిన మేనకాగాంధీకి రూ. 100 కోట్ల పరువునష్టం దావాకు సంబంధించిన నోటీసును పంపించినట్లు కోల్‌కతాకు చెందిన ఇస్కాన్ ఉపాధ్యక్షుడు, అధికార ప్రతినిధి రాధారమణ్ దాస్ ఎక్స్(పూర్వ ట్విట్టర్) పోస్టులో తెలిపారు.

మేనకా గాంధీ చేసిన దురుద్దేశ, అప్రతిష్ట పాల్జేసే ఆరోపణలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్కాన్ భక్తులు, శ్రేయోభిలాషులు, మద్దతుదారులు తీవ్ర వేదనకు గురయ్యారని ఆయన తెలిపారు.

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని అనంతరపూర్‌లోగల ఇస్కాన్ గోశాలను సందర్శించినపుడు అక్కడ తనకు వట్టిపోయిన ఆవులు, దూడలు కనిపించలేదని, వాటిని ఇస్కాన్ వధశాలలకు అమ్మివేస్తోందంటూ మేనకా గాంధీ ఇటీవల ఒక వీడియోలో ఆరోపించారు. ఈ ఆరోపణలను ఖండిస్తూ ఇస్కాన్ మరో వీడియోను విడుదల చేసింది. అనంతరపురం గోశాలలో వట్టిపోయిన ఆవుల కోసం ఒక ప్రత్యేక షెడ్‌ను కూడా ఏర్పాటు చేసి వాటిని జీవితాంతం కాపాడుకునే బాధ్యతను కొనసాగిస్తున్నామని ఇస్కాన్ తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News