Thursday, April 25, 2024

రాహుల్‌పై వేటుకు వ్యతిరేకంగా మనీశ్ తివారీ వాయిదా నోటీసు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ సోమవారం లోక్‌సభలో వాయిదా నోటీసు(అడ్జర్న్‌మెంట్ నోటీస్) ఇచ్చారు. ఆ నోటీసు ‘రాహుల్ గాంధీ అనర్హత వేటుపై చర్చించేందుకు సభ జీరో అవర్‌ను, నేటి ఇతర కార్యకలాపాలను రద్దు చేయాలి’ అని పేర్కొంది. రాహుల్ గాంధీపై సభ్యత్వ వేటు అనేది తప్పుడు నిర్ణయం, తొందరపాటు చర్య, రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకం అని పేర్కొన్నారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 102(1)(ఇ) ఒక వ్యక్తి పార్లమెంటు చేసిని ఏదైనా చట్టం ద్వారా లేదా దాని ప్రకారం అనుర్హుడైతే పార్లమెంటు సభ్యుడిగా ఎన్నుకోబడడానికి, ఉండడానికి అనర్హుడని పేర్కొంటోంది. నోటీసులో ఇంకా ఇలా పేర్కొన్నారు ‘ఆర్టికల్ 103(1) ప్రకారం సభ్యుల అనర్హతపై నిర్ణయం భారత రాష్ట్రపతికి ఉంటుంది. ఇంకా ఆర్టికల్ 103(2) ప్రకారం రాష్ట్రపతి అనర్హత నిర్ణయానికి ముందు భారత ఎన్నికల కమిషన్‌తో తప్పనిసరి సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది’. పార్లమెంటు సభ్యుల అనర్హతను పేర్కొనే అధికారం ఆర్టికల్ 103(1) ప్రకారం భారత రాష్ట్రపతికి ఉంటుంది. అయితే 103(2)ప్రకారం రాష్ట్రపతి ఓ సభ్యుడిని అనర్హుడిగా ప్రకటించడానికి ముందు భారత ఎన్నికల సంఘాన్ని సంప్రదించాల్సి ఉంటుంది.

‘1951 ప్రజాప్రాతినిధ్యం చట్టంలోని సెక్షన్ 8(3) ప్రకారం అనర్హతకు సంబంధించిన రెండు అంశాలు అవసరమైనప్పటికీ, వాటిని నెరవేర్చకుండానే రాహుల్ గాంధీని 30 రోజులపాటు సస్పెండ్ చేశారు’ అని పేర్కొన్నారు. రాహుల్ గాంధీపై వేటు చర్య రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా, సహజ న్యాయ ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించేదిగా ఉంది. పార్లమెంటు సెక్రటరియేట్ చట్టపర పరిమితికి మించినదిగ ఉండని తివారీ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ అనర్హత వేటుకు సంబంధించిన అంశంపై చర్చించేందుకు సభను వాయిదా వేయక తప్పదని తన నోటీసులో తివారీ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News