Friday, September 13, 2024

రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన మను సింఘ్వీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తెలంగాణ రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. కాంగ్రెస్ తరఫున అభిషేక్ మను సింఘ్వీ, ఇండిపెండెంట్ గా పద్మరాజన్ నామినేషన్ దాఖలు చేశారు. ఎంఎల్ఏ లు బలపరచకపోవడంతో పద్మరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురయింది. దీంతో రాజ్యసభ సభ్యుడిగా సింఘ్వీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

సింఘ్వీ తరఫున కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఎన్నికల అధికారి నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకున్నారు. అభిషేక్ సింఘ్వీ రెండు దఫాలుగా(2006, 2018) రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఈ ఏడాది హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు పోటీ చేసి బిజెపి చేతిలో ఓడిపోయారు. తెలంగాణ నుంచి స్థానిక నాయకులు రాజ్యసభ సీటు కోసం కొందరు ప్రయత్నించినా కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనకే అవకాశం కల్పించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News