Sunday, April 28, 2024

హైద్రాబాద్‌ శివార్లలో డ్రగ్స్ పరిశ్రమ

- Advertisement -
- Advertisement -

ఇంటర్ పోల్ అప్రమత్తం చేయడంతో రంగంలోకి దిగిన డిసిఎ అధికారులుఐడిఎ బొల్లారంలో డ్రగ్స్ కలకలం
పిఎస్‌ఎన్ మెడికేర్ పరిశ్రమలో సోదాలు… తనిఖీల్లో భారీగా పట్టుబడ్డ నిషేధిత డ్రగ్స్
రూ. 8.99 కోట్ల విలువచేసే మెపిడ్రిన్ స్వాధీనం
పదేండ్లుగా నిరాటంకంగా సాగుతున్న డ్రగ్స్ దందా
సిగరెట్లలో పెట్టి అమ్ముతున్నట్లు గుర్తింపు

మన తెలంగాణ/హైదరాబాద్/జిన్నారం : హైదరాబాద్ శివారులో మరోసారి డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టయింది. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డిసిఎ), ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్టుమెంట్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. భారీగా డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసు కున్నారు. మొత్తంగా రూ.8.99 కోట్ల రూపాయల విలువచేసే డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం పరుచుకున్నారు. సంగారెడ్డి పరిధిలోని ఐడిఎ బొల్లారంలోని ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లుగా ఇంటర్ పోల్ సమాచారం రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇంటర్ పోల్ సహాయంతో పిఎస్‌ఎన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో శుక్రవారం సోదాలు చేపట్టారు. నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. 90 కిలోల మెపిడ్రిన్ డ్రగ్స్‌ని డ్రగ్ కంట్రోల్ అధికారులు స్వాధీనపరుచుకున్నారు.

గత పది సంవత్సరాల నుంచి డ్రగ్స్ తయారు చేసి విదేశాలకి తరలిస్తున్న సదరు సంస్థ డైరెక్టర్ కస్తూరి రెడ్డి నెమల్లపూడిని అరెస్టు చేశారు. సిగరెట్ ప్యాకెట్లలో డ్రగ్స్‌ను పెట్టి విదేశాలకు తరలిస్తు న్నట్లు గుర్తించారు. మరోవైపు హైదరాబాదులో కూడా డ్రగ్స్ సప్లై చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్ పోల్ సహాయంతో డ్రగ్స్ రాకెట్టు గుట్టురట్టు చేసినట్లు వి.బి.కమలాసన్ రెడ్డి వెల్లడించారు. పీఎస్‌ఎన్ కంపెనీ పలు దేశాలకు డ్రస్సును సరఫరా చేస్తున్నట్లుగా సమాచారం. ప్రధానంగా యూరప్‌కు భారీ మొత్తంలో డ్రగ్స్‌ను సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. కాగా, పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుం టున్నా, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణ ఉండాలన్న ప్రభుత్వ లక్షానికి అనుగుణంగా పోలీసులు ఉక్కుపాదం మోపడంలో తమ సర్వశక్తు లొడ్డుతున్నా డ్రగ్ రాకెట్లు బయటపడుతూనే ఉండటం గమనార్హం. మత్తుకు బానిసగా మారిన యువతను టార్గెట్ చేసుకున్న మాఫియా చివరకు వారినే ఏజెంట్లుగా మార్చి చాపకింద నీరులా తమ సామ్రాజ్యాన్ని పెంచుకుంటూనే పోతుండటం గమనార్హం. డబ్బుల కోసం భావితరాల యువ తను ఈ డ్రగ్స్ ముఠాలు నాశనం చేస్తున్నారు. ఉడుకు రక్తం యువత ఆ మత్తుకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోవడంతో పాటు దేశ ద్రోహులుగా కూడా మారుతున్నారు..  డ్రగ్స్ మాఫియాలు తమ స్వప్రయోజనాలకు యువతను బానిసలుగా మారుస్తు న్నాయి. మాదకద్రవ్యాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని పోలీసులు, నిపుణులు పదే పదే సూచిస్తున్నారు. హెచ్చరిస్తున్నారు కూడా.

అయితే డ్రగ్స్ మత్తులో పడిన యువత బయటికి రాలేక ఆ ఊబిలోకి దగడమే కాకుండా అదే డ్రగ్స్ కోసం తాము సరఫరాదారులుగా మారుతూ డ్రగ్స్ సామ్రాజ్యాన్ని పెంచి పోషిస్తున్న తీరు విస్మయానికి గురి చేస్తోంది. దేశానికి ఆదర్శంగా నిలవాల్సిన యువత డ్రగ్స్ మాయలో పడటం నిజంగా దురదృష్టకరమన్నారు. డ్రగ్స్ బారిన పడకుండా యువతను రక్షించడం కోసం ఓ వైపు అవగాహనా సదస్సులు, మరోవైపు డ్రగ్స్ కేసులో దొరికితే జీవిత ఖైదు, లేదా ఉరి శిక్షలు ఉంటాయాన్ని పోలీసులు హెచ్చరిస్తున్నా ఫలితం అంతంత మాత్రంగనే ఉండటం గమనార్హం. ఇదే క్రమంలో యువత డ్రగ్స్ బారిన పడకుండా వారి తల్లిదండ్రులు సైతం ఎప్పటికప్పుడు వారిని పర్యవేక్షించి అందుకు అనుగుణంగా వారిని డ్రగ్స్ బారిన పడకుండా జాగరూకత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు చెబుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News