Saturday, September 21, 2024

అమెరికాలో మేడ్చల్ విద్యార్థి మృతి…. మృతదేహం తరలింపు కోసం సహాయం కోరుతున్న తల్లిదండ్రులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరికి చెందిన ఓ విద్యార్థి అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బుధవారం చనిపోయాడు. తన కుమారుడి మృతదేహాన్ని త్వరగా తీసుకురావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు భారత ఎంబసీ అధికారులను తల్లిదండ్రులు కోరుతున్నారు. మౌలాలీలోని కెపిహెచ్‌బి కాలనీలో కొత్తూరు సత్యనారాయణ నివసిస్తున్నారు. సత్యనారాయణ తన కుమారుడు  రంజిత్‌ను ఉన్నత చదువుల కోసం అమెరికాకు పంపాడు. రంజిత తన స్నేహితుడు విజయ్‌తో కలిసి అట్లాంటాలో ఉంటున్నారు. అగస్టు 15న కారు ప్రమాదం జరగడంతో క్రేన్ కు రంజిత్ సమాచారం ఇచ్చాడు. క్రేన్ ఆపరేటర్ వచ్చి రోడ్డు పక్కన కారు ప్రమాదాన్ని చూస్తుండగా వేగంగా వస్తున్న మరో కారు ఢీకొనడంతో తెలుగు విద్యార్థి రంజిత్ తో పాటు ఆపరేటర్ చనిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తన కుమారుడి మృతదేహాన్ని త్వరగా తీసుకురావాలని అట్లాంటాలో ఉన్న భారత ఎంబసీ అధికారులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రంజిత్ కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. తమ కుమారుడి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు సహాయ సహకారాలు అందించాలని స్థానిక ప్రజాప్రతినిధులకు కొత్తూరు సత్యనారాయణ కన్నీంటితో వేడుకుంటున్నాడు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర యంత్రాంగాలు స్పందించి మృతదేహాన్ని త్వరగా తీసుకురావాలని స్థానికులు, బంధువులు కోరుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News