Tuesday, April 16, 2024

పరవళ్లు తొక్కుతున్న గోదావరి

- Advertisement -
- Advertisement -
Medigadda Annaram Gates Open
మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ గేట్లు ఎత్తివేత

కాళేశ్వరం:  గత కొన్ని రోజులుగా మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది పరవళ్లు తొక్కుతుంది. గోదావరి, ప్రాణహిత నదులు కలిసి 51470వేల క్యూసెక్కుల వరద నీరు మేడిగడ్డ చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి గోదావరి త్రివేణి సంగమం వద్ద 6 మీటర్ల లోతు నుండి నీటి ప్రవాహం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ భారీ వర్షాల కారణంగా బ్యారేజీలకు నీటి ప్రవాహం పెరగడంతో మేడిగడ్డ లక్ష్మీబ్యారేజ్ అన్నారం, సరస్వతి బ్యారేజీ గేట్లను అధికారులు ఎత్తివేశారు. లక్ష్మి బ్యారేజ్ వద్ద 52,470 క్యూసెక్కుల వరద నీరు బ్యారేజీకి చేరగా 24 గేట్లు ఎత్తి 35,330 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదలచేశారు. ప్రస్తుతానికి లక్ష్మి బ్యారేజ్ వద్ద 9 టిఎంసిల నీటి నిల్వలు ఉన్నాయి. అలాగే అన్నారం సరస్వతి బ్యారేజ్ వద్ద 23 గేట్లు ఎత్తివేసి వరద నీరు దిగువకు వదిలారు. అన్నారం బ్యారేజ్ వద్ద 94వేల 600 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 51750 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇటు అన్నారం బ్యారేజ్ గేట్లు ఎత్తివేయడం మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి, ప్రాణహిత నదులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News