Tuesday, September 17, 2024

మెగా డిఎస్‌సి నోటిఫికేషన్ విడుదల చేయాలి

- Advertisement -
- Advertisement -

తెలంగాణ డి.ఎడ్, బి. ఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్
సమావేశానికి హాజరైన ప్రొ.కోదండరాం, బల్మూరి వెంకట్

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మెగా డిఎస్‌సి నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలంగాణ డి.ఎడ్, బి. ఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్ చేసింది. బుధవారం సంఘం అధ్వర్యంలో జరిగిన టిఆర్‌టి అభ్యర్ధుల రాష్ట్ర సభకు ప్రొఫెసర్ కోదండరామ్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి,ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ తదితరులు హాజరయ్యారు. గత ప్రభుత్వం జారీ చేసిన 5,089 టీచర్ పోస్టులకు అదనంగా మిగతా 20 వేల టీచర్ పోస్టులకు అనుబంద నోటిఫికేషన్ జారీ చేయాలని టీచర్ అభ్యర్థులు కోరారు.

ఉపాధ్యాయుల పదోన్నతులతో ముడి పెట్టకుండా వెంటనే రీ నోటిఫికేషన్ జారీ చేసి గతంలో దరఖాస్తు చేయని వారికి దరఖాస్తు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని అన్నారు. ఆన్‌లైన్ పరీక్షలు కాకుండా ఆఫ్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఉపాధ్యాయ పోస్టులకు పరీక్ష తేదీలు ఖరారు చేసి, నాలుగు నెలలు సమయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఒయు జెఎసి నాయకురాలు బాలలక్ష్మీ, ప్రొఫెసర్ అశోక్, డి.ఎడ్ బి.ఎడ్ అభ్యర్ధుల సంఘం నేతలు రావుల రామ్మోహన్ రెడ్డి, శ్రీను నాయక్, హరీష్,శ్రీనివాస్, వెంకటేష్ అమర్,మధుసూదన్, శ్రీనివాస్ రెడ్డి, మౌనిక, కవిత తదితరులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News