Sunday, April 28, 2024

విద్యుత్ ఆడిట్‌తోనే అపోహలు, అనుమానాలకు చెక్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: విద్యుత్‌శాఖపై జరుగుతున్న ప్రచారం అధికారులు దృష్టి సారించారు.ఇందులో భాగంగా విద్యుత్‌సరఫరా( డిస్ట్రిబ్యూషన్ అండ్ ట్రాన్స్‌మిషన్)పై మీదనే విద్యుత్ వృదా ,విద్యుత్ బిల్లుల వసూళ్ళ తదితర అంశాలపై క్షేత్ర స్థాయి నుంచే ఆడిట్ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.ఢిల్లీలో మాదిరిగా ప్రభుత్వ భవననాలు, కార్యాలయాలు, వీధిలైట్లు తదితర అంశాల ఎనర్జీ ఆడిట్‌ను నిర్వహించనున్నారు. దీని ద్వారా అధిక విద్యుత్ వినియోగాన్ని గుర్తించడమే కాకుండా , విద్యుత్ వృథాను కూడా అరికట్టేందుకు ప్రణాళికలను అధికారులు సిద్దం చేస్తున్నారు. ఇందుకు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) నుంచి గుర్తింపు పోందిన ఆడిటర్ ద్వారా 500 కిలో వాట్లుఅంతకంటే ఎక్కువ మంజూరైన లోడ్‌తో అన్ని భవనాలకు ఎనర్టీ ఆడిట్‌ను నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా పలు భవానాల్లో విద్యుత్ ఉపకరణారాలు వినియోగాన్ని అంచనా వేయడం కోలవడం, అవసరమైన విద్యుత్‌ను మాత్రమే వినియోగడం ద్వారా ఇంధన పోదుపు పై కూడ దృష్టి సారిస్తున్నారు.

ముఖ్యంగా విద్యుత్‌ను పొదుపు చేయడమంటే విద్యుత్‌ను ఆదా చేయడమే అనే సూత్రాన్ని పాటించడమే కాకుండా , వినియోగదారుని చివరి యూనిట్ వినియోగాన్ని ఆదాయం, చేయడం, పవర్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేయబడని రెండు యూనిట్లకు సమానం అనే సూత్రాన్ని పాటించున్నారు. ఈ ఆడిట్ ద్వారా ఇంధన పొదుపు చర్యలు తీసుకోవడమే కాకుండా ప్రభుత్వ ఖజానాపై ఆర్దిక భారం తగ్గించ వచ్చంటున్నారు.అదే విధంగా కాలేశ్వం ప్రాజెక్టు నిర్వహనణకు ఎంత విద్యుత్ వ్యయం అయ్యింది. ప్రాజెక్టు నిర్మాణానికి ముందు కాలేశ్వరం ప్రాజెక్టు పరివాహాక ప్రాంతాల్లో ఎన్ని విద్యుత్ మోటర్లు ఉన్నాయి. వాటికి ద్వారా ఎంత విద్యుత్ వినియోగం జరిగింది తదితర వివరాలపై ఆడిట్ నిర్వహింనున్నట్లు తెలిసింది. సాధారణంగా కాలేశ్వం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత గ్రావిటి ద్వారా నీటి సరఫరా జరిగినా ఇంత పెద్ద మొత్తంలో విద్యుత్ వినియోగం ఎందకయ్యింది.

ప్రాజెక్టు నిర్మాణం అనంతరం భారీ ఎత్తున బోరు ఎత్తున బొర్లు ఏర్పాటు అయ్యేందుకు కారణం ఏమిటనే వివరాలే కాకుండా విద్యుత్ లోడ్ డిస్పాచ్‌లో ఎవైనా సమస్యల కారణంగా విద్యుత్ వినియోగం అధికం కావడం తద్వారా బిల్లులు పెరగడం తదితర అంశాలన్నీ ఈ ఆడిట్‌ల ద్వారా బయటకు వస్తాయని చెబుతున్నారు.విద్యుత్ వినియోగంలో సుమారు 40 శాతం ప్రభుత్వ అవసరాలకు (త్రాగు, నీరు సాగు నీరు ) వినియోగం జరుగుతుందని చెబుతున్నారు.

ఒక వైపు విద్యుత్‌పై ఆడిట్‌ను నిర్వహిస్తూ మరో సాంప్రదాయేతర విద్యుత్‌ను ఏ విధంగా అవృద్ది చేసుకోవాలి ప్రస్తుతం ఉన్న సోలార్, విండ్, గ్యాస్ , తదితర వనరులు వినియోగం ద్వారా ఎంత విద్యుత్ వినియోగం జరుగుతుంది. మరింత సామర్ధం పెంచేందుకు నిర్వహిస్తున్న చర్యలను కూడా ఈ ఆడిట్‌లో తెలిసే అవకాశం ఉందుంటున్నారు. ఇటువంటి చర్యల ద్వారా క్షేత్ర స్థాయిలో విద్యుత్ వినియోగం పైనే కాకుండా పై స్థాయిలో విద్యుత్ వినియోగంపై ఉన్న అనుమనాలు, అపోహలు తేట తెల్లం అవుతాయనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News