Saturday, April 27, 2024

క్రీడలతో మానసిక ఉల్లాసం

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ : క్రీడల వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక రుగ్మతలను దూరం చేసుకోవచ్చని, దీంతో పాటు మంచి క్రమశిక్షణ కలిగి ఉండడం వలన సమాజంలో మ ంచి పేరు తెచ్చుకోవచ్చని జిల్లా ఎస్పి కె. మనోహర్ అన్నారు. అంతర్జాతీయ ఖోఖో దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉమ్మడి మహ బూబ్‌నగర్ జిల్లా ఖోఖో అసోసియేషన్ వారి అనుబంధంతో నాగర్‌కర్నూల్ జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎస్పి కార్యాలయంలో వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులను ఎస్పి మనోహర్ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

అనంతరం ఎస్పి మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లాలో జాతీయ స్థాయి కాక అంతర్జాతీయ స్థాయిలో కూడా క్రీడాకారులు రాణించాలని, క్రీ డాకారులు, వ్యాయామ ఉపాధ్యాయలు క్రీడల పట్ల ఉత్సాహం కనబర్చాలని అన్నారు. బల్మూర్ వ్యాయామ ఉపాధ్యాయులు పిడి మణి, అచ్చంపేట పిఈటి నీలాభాయ్, పెద్దపల్లి పిఈటి యాదయ్య, తూడుకుర్తి పిఈటి కృష్ణ, క ల్వకుర్తి సందీప్, సయ్యద్, వెల్దండ లలిత, తుర్కలపల్లి పార్వతమ్మలను సన్మానించారు. సీనియర్ క్రీ డాకారులు ప్రకాష్, పోలంచంద్ మోహన్ లాల్, కుర్మయ, రవి కుమార్, రాఘవులు గౌడ్‌తో పాటు నా గర్‌కర్నూల్ జిల్లా ఖోఖో అసొసియేషన్ ఇంచార్జి శేర్మం నిరంజన్ యాదవ్, సోమ రమేష్ ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News