Sunday, June 4, 2023

రేపటి ఐపిఎల్ మ్యాచ్ సందర్భంగా మెట్రో రైళ్ల సంఖ్య పెంపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐపిఎల్ సందడి ఇప్పటికే మొదలైన సంగతి మీకు తెలిసిందే. హైదరాబాద్ లో రేపు సన్ రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఉప్పల్ లో జరిగే ఈ మ్యాచ్ సందర్భంగా రవాణా పరంగా క్రికెట్ ప్రియులకు ఏమాత్రం ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు మెట్రో రైళ్ల సంఖ్యను పెంచాలని అధికారులు నిర్ణయించారు. రద్దీ దృష్ట్యా నాగోల్- అమీర్ పేట మార్గంలో ఎక్కువ సంఖ్యలో రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి అధిక సంఖ్యలో మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News