Thursday, May 2, 2024

ఎపికి తుఫాన్ ముప్పు.. రెడ్ అలర్ట్ జారీ

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ కు తుఫాన్ ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆదివారం నుంచి రెండు రోజుల పాటు ఎపిలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం రానున్న 48 గంటల్లో తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.ఈ నేపథ్యంలో ఎపిలోని పలు జిల్లాల్లో ఆదివారం, సోమవారం, మంగళవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్నొన్నారు.
తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం.. కోస్తాంధ్ర జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మత్స్యకారులను వేటకు వెళ్ల వద్దని ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్ లో 1077 కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News