Thursday, February 29, 2024

స్కూల్లో నుంచి పంతులును ఎత్తుకెళ్లి… గన్‌తో బెదిరించి వివాహం చేశారు…

- Advertisement -
- Advertisement -

పాట్నా: టీచర్‌ను ఎత్తుకెళ్లి చితకబాది, గన్‌తో బెదిరించి యువతితో పెళ్లి జరిపించిన సంఘటన బిహార్‌లోని వైశాలి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. గౌతమ్ కుమార్ అనే యువకుడు గవర్నమెంట్ టీచర్‌గా ఉద్యోగం వచ్చింది. పతేపూర్‌లోని రేపూరా ఉత్క్రమిత్ మధ్య విద్యాలయంలో అతడు విధులు నిర్వహిస్తున్నాడు. బుదవారం స్కూల్ వెళ్లి పాఠాలు బోధిస్తుండగా నలుగురు వ్యక్తులు అక్కడికి వచ్చి అతడిని కిడ్నాప్ చేశారు.

కిడ్నాపర్లలో ఒకరి కూతురితో బలవంతంగా అతడికి పెళ్లి చేశారు. కిడ్నాప్ సమాచారం తెలుసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గౌతమ్ కుటుంబ సభ్యులు రోడ్డుపైకి చేరుకొని నిరసన తెలిపారు. చాందినిని వివాహం చేసుకోవడానికి గౌతమ్ నిరాకరించడంతో చితకబాది గన్‌తో బెదింరించి బలవంతంగా తాళి కట్టించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. అబ్బాయిలను కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లిలు చేయడం ఎక్కువగా జరుగుతుండడంతో అటువంటి వివాహాలను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు చెప్పిన కూడా అక్కడ పరిస్థితులు మారడం లేదు. బలవంతపు పెళ్లిలను పకడ్వా వివాహం అంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News