Wednesday, May 29, 2024

కాపై నిరసన

- Advertisement -
- Advertisement -

MIM

 

హైదరాబాద్ పాతబస్తీలో ఎంఐఎం ఆధ్వర్యంలో తిరంగ యాత్ర

హైదరాబాద్: సిఎఎ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌ఆర్‌పిలకు నిరసనగా శుక్రవారం యూనైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీ నిర్వహించారు. మీరాలం ఈద్గా నుండి శాస్త్రిపురం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న ఆందోళనకారులు సిఎఎ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌లను రద్దు చేయాలని పెద్ద ఎత్తున నినదించారు. జాతీయ జెండాలను చేతబూని, ప్లకార్డులతో ప్రదర్శనలో పాల్గొన్నారు. ఇంక్విలాల్ జిందాబాద్, సిఎఎ రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్క్ ఏక్‌హై, భారత్ హమారా ముల్క్ హై అంటూ బ్యానర్‌లను ప్రదర్శించారు. ఈ మేరకు రాజ్యాంగ పీఠిక, మహాత్మాగాంధీ, అంబేద్కర్ చిత్రపటాలను ప్రదర్శించారు.

హైదరబాద్ నలుమూలల నుండి వేలాది మంది పాద యాత్రగా తరలి వచ్చారు. హైదరాబాద్ యూనివర్సిటీ, జెఎన్‌టియూహెచ్ యూనివర్సిటీ, మౌలానా అజాద్ ఉర్ధూ యూనివర్సిటీల నుండి విద్యార్థులు విన్నూత తరహా ప్రదర్శనలు నిర్వహించారు. చార్మినార్, మెహిదిపట్నం,మల్లేపల్లి, మలక్‌పేట్, నాంపల్లి, ముషిరాబాద్ తదితర ప్రాంతాలను భారీ నుంచి భారీగా యువతి, యువకలు, మహిళలు, విద్యార్థులు తరలి వచ్చారు. ర్యాలీ ముగింపు సందర్భంగా మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సిఎఎ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌ల రద్దు చేయకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రకటించారు.

భారత రాజ్యాంగ పరిరక్షణకు సిఎఎ,ఎన్‌ఆర్‌సి,ఎన్‌పిఆర్‌లను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మతాల ఆధారంగా పౌరులకు పౌరసత్వ కల్పించడం రాజ్యాంగ వ్యతిరేకంగా వివరించారు. ఈ నెల 25వ తేదీ చార్మినార్ వద్ద నిరనసన సభ,ముషాహేరా(కవిసమ్మేళనం), ఆర్ధరాత్రి 12గంటల తర్వాత జాతీయ జెండా ఆవిష్కరణ నిర్వహిస్తామని వెల్లడించారు. ఈనెల 30వ తేదీ బాపూఘాట్ నుండి మహ్మదీ లైన్ వరకు మానవహారం నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ ర్యాలీలో మజ్లిస్ మజ్లిస్ శాసన సభ్యులు మేరాజ్ హుస్సేన్, మౌజంఖాన్, షాషఖాద్రీ, మండలి సభ్యులు అమీన్ జాఫ్రి, రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మహ్మద్ మసివుల్లా ఖాన్, రాష్ట్ర ఉర్ధు అకాడమీ చైర్మన్ రహిమోద్దీన్ అన్సారీ, జమాతే ఇస్లామియా హింద్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల అధ్యక్షులు హమీద్ మహ్మద్ ఖాన్, హైదరాబాద్ దారుల్ ఉలూమ్ మదార్సా నిర్వహకులు జాఫర్‌షాష, సునియా ఉలేమా బోర్డు, షియా వివిధ ముస్లిం ప్రజా సంఘాలు, పలు దర్గాల పీఠాధిపతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ట్రాఫిక్ అంక్షలు:
ర్యాలీ నిర్వహంచే మార్గంలో పోలీసులు ట్రాఫిక్ అంక్షలు విధించారు. ఆరాంఘర్ చౌరస్తా నుండి బస్సులను, ఇతర వాహనాలను దారి మళ్ళించారు. బహదూర్ పూరా నుండి ఆఫ్జల్ గంజ్ వైపు వరకు మాత్రమే బస్సులను, ఇతర వాహనాలను అనుమతి ఇచ్చారు. మధ్యాహ్నం 12 గంటల నుండే ట్రాఫిక్ అంక్షలు అమలులోకి వచ్చాయి. తిరంగ ర్యాలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు భద్రతా చర్యలను చెపట్టారు.

అసద్‌కు హైకోర్టు షాక్:
సిఎఎకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో తిరంగ ర్యాలీ నిర్వహించాలని భావించిన మజ్లిస్ అధినేత, హైదాబాద్ ఎంపి అసద్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. బహదూర్‌పూరాకు చెందిన నందరాజ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌దాఖలు చేశారు. ఈ పటిషన్ విచారించిన కోర్టు సిటి పోలీసులను ఆఫిడవిట్ కోరింది. పోలీసులు అనుమతి వరకే కొద్ది మందితోనే ర్యాలీ నిర్వహించాలని హైకోర్టు అదేశించింది. అంతేకాకుండా ఈ ర్యాలీలో సంఘ విద్రోహక శక్తులు చొరబడి అల్లర్లకు పాల్పడే ప్రమాదం ఉందని, ఈ ర్యాలీని పూర్తిగా వీడియో తీయాలని పోలీసులకు హైకోర్టు అదేశించింది. దీంతో ఈ ర్యాలీతో సత్తా చాటుదామని యోచించిన అసద్‌కు షాక్ తగిలినట్లైంది.

MIM protest against CAA
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News