Saturday, July 27, 2024

ఈనెల 8న నిరుద్యోగులకు మినీ జాబ్‌మేళా

- Advertisement -
- Advertisement -

Job Mela

 

హైదరాబాద్: జిల్లాలో నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలను కల్పించుటకు ఈనెల 8న శనివారం మినీజాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఉస్మానియా యూనివర్శిటీ ఎంప్లామెంట్, మాడల్ కెరియర్ సెంటర్ డిప్యూటీ చీప్ అధికారి ఎన్. అనంతరెడ్డి తెలిపారు. బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ స్పైడర్ ఎలక్ట్రికల్, జస్ట్ డయల్ లిమిటెడ్, గ్లోబల్ డేటా, అల్ ట్రస్టు టెక్నాలజీ, ప్రొబిటి సొల్యూషన్స్, ఐడిబిఐ ఫెడరల్ ఎల్‌ఐసి,అపోలో ఫార్మసీ, జికెబీ ఆర ఎక్స్‌లెన్స్, వేగారియాస్, హెచ్‌డిబి పైనాన్స్ వంటి 12 ప్రైవేటు కంపెనీలలో పనిచేయుటకు దాదాపు 900 ఉద్యోగాల ఎంపికకు మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

అభ్యర్దులు పది, ఇంటర్,డిగ్రీ,పిజి డిప్లొమా, బిటెక్, ఎంబిఏ, బిఫార్మసీ చదివిన వారంతా అర్హులని, వీరిని కస్టమర్‌కేర్ ఎగ్జిక్యూటివ్, బిజినెస్ డెవలప్‌మెంట్, ఫార్మ అసిస్టెంట్, టెలికాలర్స్, కస్టమర్ సర్వీస్, ప్రమోటర్స్ , ప్రాసెస్ అసోసిటివ్,ఇన్‌సైడ్ సేల్స్ వంటి ఉద్యోగాల కోసం ఇంటర్వులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఎంపికైన వారికి నెలకు వేతనం రూ. 10వేలు నుండి రూ.20వేల వరకు అందజేయనున్నట్లు, అభ్యర్దుల వయస్సు 19నుండి 30 సంవత్సరాల గల పురుషులు, స్త్రీలు అర్హులన్నారు. ఆసక్తి గల నిరుద్యోగులు బయోడేటా విద్యార్హతల జీరాక్స్ పత్రాలతో ఉదయం 10.30గంటలకు సింఖ్రో సర్వ్ గ్లోబల్ సోలుషన్స్ అల్వాల్ నందు హాజరు కావాలని సూచించారు.

mini job mela for unemployed at hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News