Friday, September 20, 2024

రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రి జూపల్లి పర్యటన

- Advertisement -
- Advertisement -

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ నెల 12 సోమవారం పర్యటించనున్నారు. పర్యాటక అభివృద్ధిలో భాగంగా పర్యాటక ప్రాంతాలను సందర్శించనున్నారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ఉన్న అవకాశాలు, పర్యాటకులకు మౌలిక వసతుల కల్పన, ఇతర అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తారు. ఉదయం 9.15కి నేలకొండపల్లిలోని బుద్ద స్థూపాన్ని సందర్శించి పనుల పురోగతిని పర్యవేక్షిస్తారు. ఖమ్మం ఖిల్లాను సందర్శించి, రోప్ వే ఏర్పాటు,

ఇతర వసతుల కల్పనకు సంబంధించి చేపట్టాల్సిన పనులను కూడా ఖరారు చేస్తారు. వైరా రిజర్వాయర్‌ను సందర్శంచి, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ఉన్న అవకాశాలను, సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తారు. అనంతరం భద్రాచల శ్రీసీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నాం 3.10కి కిన్నెరసాని ప్రాజెక్ట్ వద్ద బడ్జెట్ హోటల్, ఇతర పర్యాటక ప్రాజెక్ట్‌లు, బోటింగ్‌ను అంశాలను పరిశీలిస్తారు. ఇల్లందు ఎక్స్ రోడ్, కొత్తగూడెం వద్ద బడ్జెట్ హోటల్, కన్వెన్షన్ హాల్, ఇతర పర్యాటక ప్రాజెక్ట్ లను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తారని అధికార వర్గాల సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News